Road Safety Cess ( Image Credit to Original Source )
Road Safety Cess : కొత్త వాహనం కొనేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై కొత్త వాహనం కొనేవారు భారీ మొత్తంలో టాక్స్ పే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో భారీగా వసూలు చేయనుంది.
వచ్చే నెల మొదటి తేదీ నుంచే కొత్త వాహనాలపై ఈ నిబంధనలు వర్తిస్తాయి. మోటారు వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం.. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే కొత్త అదనపు పన్ను బాదేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.
రూ. 2వేల నుంచి రూ. 10వేల పన్ను పడుద్ది :
ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం నాన్ ట్రాన్స్‌పోర్ట్ కొత్త వాహనాలపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రోడ్ సేఫ్టీ సెస్ అదనంగా చెల్లించాలి. టూవీలర్ వాహనాలతో పాటు కార్లు, పర్సనల్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్, ప్యాసెంజర్ ఆటోలు ఈ పన్ను పరిధిలోకి వస్తాయి.
కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలోనే అదనపు ట్యాక్స్ పే చేయాలి. గతంలో 3 వీలర్ గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్ను ఉండేది. అంటే.. ప్రతి 3 నెలలకు ఒకసారి రోడ్డు సేఫ్టీ టాక్స్ చెల్లించాల్సి ఉండేది. ఇకపై లైఫ్ టైమ్ (ఒకసారి) ట్యాక్స్ రూల్ తీసుకొస్తోంది తెలంగాణ రవాణా శాఖ.
రోడ్డు భద్రతకు సంబంధించి చర్యలకు నిధుల సమీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ అదనపు రోడ్డు ట్యాక్స్ ద్వారా ప్రతి ఏడాదిలో సుమారు రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే, వ్యవసాయ ప్రయోజనాలకు వాడే ట్రాక్టర్లు, ట్రైలర్లకు మాత్రం ఈ రోడ్డు టాక్స్ నుంచి మినహాయింపు లభించనుంది.
టూవీలర్ వాహనాలు (బైకులు) రూ. 2వేలు రోడ్డు టాక్స్, ఫోర్ వీలర్లలో కార్లపై రూ. 5వేలు, భారీ నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలపై రూ. 10వేల చొప్పున సెస్ నిర్ణయించారు. దాంతో వాహన ధరలు భారీగా పెరగున్నాయి.
సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారుల జేబులకు చిల్లు పడనుంది. ఈ రోడ్ ట్యాక్స్ పరిధిలో కార్లు, బైకులు, లైట్ వెయిట్ వాహనాలు వస్తాయి. అలాగే, ఇతర వాహనాల్లో 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్యాసెంజర్ ఆటోలు ఉంటాయి. బైకులు, స్కూటీలకు రూ. 2 వేలు పన్ను ఉంటుంది.