Nohing Phone 3 : అమెజాన్ బంపర్ ఆఫర్.. నథింగ్ ఫోన్ 3పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!
Nohing Phone 3 : నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published On : August 3, 2025 / 10:49 AM IST
Nohing Phone 3
Nohing Phone 3 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. యూకే ఆధారిత బ్రాండ్ నుంచి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ నథింగ్ ఫోన్ 3 ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Nohing Phone 3) సందర్భంగా ఈ నథింగ్ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. రూ. 56వేలు తక్కువ ధరకే లభిస్తోంది.
ఈ నథింగ్ ఫోన్ 3 అసలు ధర రూ. 79,999 ధర ఉండగా, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ క్లీన్, క్లటర్-ఫ్రీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ :
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 ప్రస్తుతం రూ.56,500 ధరకు లిస్ట్ అయింది. లాంచ్ ధర నుంచి రూ.23,499కి తగ్గింది. ఆసక్తిగల కస్టమర్లు SBI క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
పాత ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ బట్టి రూ.33,400 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు రూ. 2,726 నుంచి ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ HDR10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది. 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తుంది. అదనంగా, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4తో పాటు 16GB వరకు ర్యామ్, హుడ్ కింద 512GB వరకు స్టోరేజ్‌తో సపోర్టు ఇస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఇందులో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
