E-Aadhaar App : ఆధార్ హోల్డర్లకు అలర్ట్.. ఇకపై నో ఫిజికల్ కార్డు.. అతి త్వరలో QR వెరిఫికేషన్‌తో ఇ-ఆధార్ యాప్.. ఇదేలా పనిచేస్తుందంటే?
E-Aadhaar App : ఆధార్ వెరిఫికేషన్ కోసం ఫిజికల్ కార్డుల అవసరం ఉండదు. ఇ-ఆధార్ యాప్ ద్వారా QR కోడ్ వెరిఫికేషన్ ప్రాసెస్ మరింత ఈజీ కానుంది.

E-Aadhaar App
E-Aadhaar App : ఆధార్ కార్డు హోల్డర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఇ-ఆధార్ యాప్ రాబోతుంది. క్యూఆర్ కోడ్ ద్వారానే ఆధార్ వెరిఫికేషన్ (E-Aadhaar App) ప్రక్రియ ఉంటుంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా కొత్త QR కోడ్-ఆధారిత ఈ-ఆధార్ సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చేందుకు యూఐడీఏఐ సన్నాహాలు చేస్తోంది.
ఐడెంటిటీకి సంబంధించి ఆధార్ కార్డు ఫిజికల్ ఫొటోకాపీలను ఇకపై తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త సిస్టమ్ ద్వారా రాబోయే డిజిటల్ ఆధార్ అప్‌గ్రేడ్ వెరిఫికేషన్ ప్రక్రియను మరింత సులభతరం కానుంది. ఆధార్ హోల్డర్లు ఐడెంటిటీ చెకింగ్ కోసం డిజిటల్ QR స్కాన్ వినియోగించాల్సి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.
యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ ప్రకారం.. ప్రస్తుతం వినియోగంలో ఉన్న లక్ష ఆధార్ అథెంటికేషన్ మిషన్లలో దాదాపు 2వేలు మిషన్లను కొత్త సిస్టమ్‌కు సపోర్టు చేసేలా అప్‌గ్రేడ్ చేశారు. యూఐడీఏఐ అప్‌డేట్ చేసిన ఆధార్ మొబైల్ యాప్‌ను రిలీజ్ చేసేందుకు రెడీగా ఉంది.
వినియోగదారులు పర్సనల్ డేటాను పేరు, అడ్రస్, పుట్టిన తేదీ వంటివి నేరుగా స్మార్ట్‌ఫోన్‌ల నుంచి సవరించేందుకు అనుమతిస్తుంది. ఫిజికల్ రిజిస్టర్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం ఉండదు.
ఇ-ఆధార్ యాప్ అమలు ఎప్పుడంటే? :
నవంబర్ 2025 నుంచి ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియల కోసం ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను మాత్రమే సందర్శించాల్సి ఉంటుంది. అన్ని ఇతర డేటా మార్పులు యాప్ ద్వారా డిజిటల్ అవుతాయి. ఈ ప్రాసెస్‌ను పేపర్ లెస్‌గా మరింత అందుబాటులోకి తీసుకురానుంది.
UIDAI అథెంటికేట్ ప్రభుత్వ డేటాబేస్‌ల నుంచి నేరుగా యూజర్ల డేటాను తీసుకుంటుంది. ఇందులో జనన ధృవీకరణ పత్రాలు, పాన్ కార్డులు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, PDS సిస్టమ్ కింద రేషన్ కార్డులు, MNREGA వంటి రికార్డులు ఉన్నాయి.
అదనంగా, అడ్రస్ వెరిఫికేషన్ మరింత ఈజీ అయ్యేందుకు పవర్ బిల్లు రికార్డులను కూడా చేర్చే అవకాశం ఉంది. తద్వారా యూజర్ల ప్రైవసీని వారి ప్రమేయం లేకుండా తస్కరించే వీలుండదు. దేశమంతటా దాదాపు 1.3 బిలియన్ ఆధార్ హోల్డర్లకు సురక్షితమైన డేటా అందుబాటులో ఉంటుంది.