×
Ad

Nothing Phone 3a : ఇది కదా ఆఫర్ అంటే.. నథింగ్ ఫోన్ 3aపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి!

Nothing Phone 3a : నథింగ్ ఫోన్ 3a అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సందర్భంగా రూ. 21వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.

1/6
Nothing Phone 3a : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ 2025 అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ ఈవెంట్ సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అనేక స్మార్ట్‌ఫోన్‌లతో సహా ఇతర ప్రొడక్టులపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
2/6
బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్‌లను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే వెల్లడించింది. అత్యుత్తమ డీల్‌లలో నథింగ్ ఫోన్ 3aపై డిస్కౌంట్ అందిస్తుంది.
3/6
నథింగ్ ఫోన్ 3a ప్రత్యేకమైన డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ నథింగ్ ఫోన్ 3ఎ తగ్గింపు ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
4/6
నథింగ్ ఫోన్ 3aతో ఫ్లిప్‌కార్ట్ డీల్ : భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 3a రూ.24,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో రూ.20,999 ధరకు అందుబాటులో ఉంటుంది.
5/6
నథింగ్ ఫోన్ 3a స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : నథింగ్ ఫోన్ 3a స్మార్ట్‌ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ నథింగ్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ కలిగి ఉంది. 50W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో వస్తుంది.
6/6
ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. నథింగ్ ఫోన్ 3a బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.