OnePlus 12R Price Drop : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ ప్లాట్ డిస్కౌంట్ పొందాలంటే?

OnePlus 12R Price Drop : వన్‌ప్లస్12ఆర్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్‌ అందిస్తోంది. సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ లాంటి ఎక్స్‌‌పీరియన్స్ కోరుకునే యూజర్లు ఈ వన్‌‌ప్లస్ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

OnePlus 12R Price Drop : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ ఫోన్ ధర భారీ తగ్గింపును పొందింది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ప్రీమియం వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. వన్‌ప్లస్ ఫోన్ డివైజ్‌లపై ఏవైనా డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. ఈ ఫోన్ చూస్తున్న యూజర్లు కొనుగోలుకు చేయొచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్ వన్‌ప్లస్ అధికారిక పార్టనర్ కాదని గుర్తుంచుకోండి. అధీకృత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అమెజాన్ కూడా ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.

Read Also : Mahindra XUV700 AX5 : మహీంద్రా ఎక్స్‌యూవీ700 AX5 కారు వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే? పూర్తి ధరల జాబితా ఇదే!

వన్‌ప్లస్ 12ఆర్ ధరపై రూ. 3,633 డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 36,366గా ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 39,999కు పొందవచ్చు. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ రూ. 3,633 డిస్కౌంట్ అందిస్తోంది. మరోవైపు, అమెజాన్ ఈ ఫోన్ రిటైల్ ధరకు మాత్రమే విక్రయిస్తోంది. అయితే, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2వేల తగ్గింపుతో సహా కొన్ని బ్యాంక్ ఆఫర్‌లపై రూ.37,999కి ధర తగ్గింపు పొందవచ్చు.

రూ. 40వేల లోపు ధరకే వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ :
వన్‌ప్లస్12ఆర్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్‌ అందిస్తోంది. సరసమైన ధరలో ఫ్లాగ్‌షిప్ లాంటి ఎక్స్‌‌పీరియన్స్ కోరుకునే యూజర్లు ఈ వన్‌‌ప్లస్ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ 4వ జనరేషన్ ఎల్‌టీపీఓ టెక్నాలజీతో కూడిన భారీ 6.78-అంగుళాల 120హెచ్‌జెడ్ అమోల్డ్ ప్యానెల్, 4,500 నిట్‌ల వరకు ఆక్వా టచ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఫోన్ అదిరే డిస్‌ప్లేతో వస్తుంది.

గత ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 కలిగి ఉంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. మార్కెట్‌తో పోలిస్తే.. ఈ ఫోన్ పెద్ద 5,500ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. లైఫ్ టైమ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు, బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్, ఐపీ64 రేటింగ్ రూ. 40వేల లోపు ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ఫోన్ అదిరే డీల్ అందిస్తోంది. ఈ ఫోన్ మెటల్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్రీమియం క్వాలిటీని అందిస్తుంది.

Read Also : WhatsApp Multi-Account : వాట్సాప్‌‌లో మల్టీ అకౌంట్ ఫీచర్.. ఒకే ఫోన్‌లో 2 అకౌంట్లు వాడొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు