OnePlus 13R Discount
OnePlus 13R Price Cut : వన్‌ప్లస్ ఫోన్ ఆఫర్ మీకోసమే.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా వన్‌ప్లస్ 13R ఫోన్ అతి తక్కువ ధరకే (OnePlus 13R Price Cut) లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయింది.
16GB ర్యామ్, 512GB స్టోరేజీతో ఇప్పుడు భారీ తగ్గింపు (OnePlus 13R price drop) ధరకే అందుబాటులో ఉంది. అనేక బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా పొందవచ్చు. రూ. 30వేల లోపు ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు.
వన్‌ప్లస్ 13R డిస్కౌంట్ :
వన్‌ప్లస్ 13R ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ వన్‌ప్లస్ ఫోన్ లాంచ్ ధర రూ. 44,999 ఉండగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 39,999కే లభ్యమవుతుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు SBI క్రెడిట్ కార్డ్‌తో రూ. 1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ప్రస్తుతం వన్‌ప్లస్ ధర రూ. 38,749కి తగ్గుతుంది. అమెజాన్ రూ.36,650 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ.7వేలు ఉంటే.. ఈ ఫోన్ దాదాపు రూ.30వేలకు పొందవచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.
వన్‌ప్లస్ 13R ఫీచర్లు :
వన్‌ప్లస్ 13R ఫోన్ 6.78-అంగుళాల 120Hz ProXDR డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశంతో 1600 నిట్స్ వరకు ఉంటుంది. ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ GG7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఆక్సిజన్ OS15పై రన్ అవుతుంది.
హుడ్ కింద, వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్, 512GB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. పెద్ద 6000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13R ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్-కెమెరా సెటప్ కలిగి ఉంది. 50MP మెయిన్ కెమెరా, 50MP సెకండరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ 5G, 4G, బ్లూటూత్ 5.4, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.