×
Ad

OnePlus 13R Price : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13Rపై భారీ తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్ లవర్స్ వెంటనే బుక్ చేయండి..!

OnePlus 13R Price : వన్‌ప్లస్ 13R అదిరిపోయే డీల్.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13పై బిగ్ డీల్ అందిస్తోంది. వన్‌ప్లస్ ఫోన్ లవర్స్ వెంటనే కొనేసుకోవడం బెటర్..

OnePlus 13R Price

OnePlus 13R Price : వన్‌ప్లస్ అభిమానులకు అద్భుతమైన ఆఫర్.. నవంబర్ 13న వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R లాంచ్ కానున్నాయి. అంతకన్నా ముందుగానే వన్‌ప్లస్ 13R ధర భారీగా తగ్గింది. మీ పాత వన్‌ప్లస్ ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్..

ఈ కొత్త మోడల్స్ మార్కెట్లోకి రాకముందే చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు (OnePlus 13R Price) ప్రస్తుత మిడ్-రేంజర్ వన్‌ప్లస్ 13R భారీ ధర తగ్గింపుతో అందిస్తోంది. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. వన్‌ప్లస్ 13R ఫోన్ ఇప్పుడు అసలు ధర కన్నా రూ. 7,400కు పైగా డిస్కౌంట్ లభిస్తోంది. ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ పర్ఫార్మెన్స్ చూసే ఎవరికైనా అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు. ఇంతకీ ఈ ఆఫర్‌ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13R ధర తగ్గింపు :
వన్‌ప్లస్ 13R రూ.42,999కి లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.37,946కి లిస్ట్ చేసింది. ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో రూ.5,503గా అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు అదనంగా రూ.1,898 తగ్గింపును పొందవచ్చు.

Read Also : iPhone 16 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ బ్లాస్టింగ్ ఆఫర్.. ఇంత చీప్‌గా ఐఫోన్ మళ్లీ దొరకదు!

తద్వారా వన్‌ప్లస్ 13 ఫోన్ ధర రూ.36,048కి పొందవచ్చు. మొత్తం రూ.7,401 తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే మీరు ఇంకా తగ్గింపు పొందవచ్చు. పర్ఫార్మెన్స్-ఆధారిత స్పెషిఫికేషన్లు, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. కొత్త వన్‌ప్లస్ 15 సిరీస్ రాకముందే బెస్ట్ ప్రీ-లాంచ్ ఆఫర్‌లలో పొందవచ్చు.

వన్‌ప్లస్ 13R స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13R 6.78-అంగుళాల 1.5K ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, 16GB వరకు LPDDR5x ర్యామ్, 512GB యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది.

తక్కువ టైంలో తొందరగా ఛార్జ్ అవుతుంది. కెమెరాల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 13R ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP ఫ్రంట్ షూటర్‌ అందిస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్ అనే రెండు కలర్ ఆప్షన్ల మధ్య ఎంచుకోవచ్చు.