Amazon Great Freedom Sale : అదిరే డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13s అతి చౌకైన ధరకే.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..!

Amazon Great Freedom Sale : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్‌లో 'అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్' ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు పొందవచ్చు.

Amazon Great Freedom Sale

  • వన్‌ప్లస్ 13s ఫోన్ 6.32-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లే
  • 50MP ప్రైమరీ కెమెరా సెటప్
  • క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌
  • వన్‌ప్లస్ 13sపై డిస్కౌంట్లు, ఆఫర్లు ధరలివే

Amazon Great Freedom Sale : వన్‌ప్లస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెజాన్‌లో ‘అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్’ నడుస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హోం అప్లియన్సెస్ వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 13s కొనేందుకు చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. వన్‌ప్లస్ 13sపై అద్భుతమైన డీల్స్‌ అందిస్తోంది. వన్‌ప్లస్ 13sపై డిస్కౌంట్లు, ఆఫర్లు, ధరలను ఇప్పుడు వివరంగా చూద్దాం..

వన్‌ప్లస్ 13s ధర ఆఫర్లు :
వన్‌ప్లస్ 13s ఫోన్ 12జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ అందిస్తుంది. అమెజాన్‌లో రూ. 51,999 ధరకు (Amazon Great Freedom Sale) లిస్టు అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది జూన్‌లో రూ. 54,999 ధరకు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చేసే పేమెంట్లపై ఫ్లాట్ రూ. 2వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర కన్నా సుమారు రూ.5వేలు తక్కువకే లభిస్తుంది. స

Read Also : Apple iPhone 17 Pro Max : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డీల్.. ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అతి తక్కువకే.. ధర జస్ట్..

వన్‌ప్లస్ 13s ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 13sలో 6.32-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లే ఉంది. 2640×1216 పిక్సెల్స్ FHD+ రిజల్యూషన్, 19.54:9 యాస్పెక్ట్ రేషియో, 1600/800 నిట్స్ బ్రైట్‌నెస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఆక్టా-కోర్ అడ్రినో 830 జీపీయూతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 15పై రన్ అవుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5850mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే.. :
వన్‌ప్లస్13s బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఎఫ్/2.0 అపర్చర్‌తో 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఎఫ్/2.0 అపర్చర్‌తో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

కొలతల పరంగా పరిశీలిస్తే.. ఈ వన్‌ప్లస్ 13s ఫోన్ 15.08 సెం.మీ. పొడవు, 7.17 సెం.మీ. వెడల్పు, 0.82 సెం.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, GPS, సింగిల్ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.