ఆన్ లైన్ సందడి : అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

  • Publish Date - September 29, 2019 / 04:58 AM IST

దసరా పండుగ వచ్చేస్తోంది. ఆల్ రెడీ నవరాత్రులు (సెప్టెంబర్ 29) నుంచి ప్రారంభయ్యాయి. ఈ పండుగను అత్యంత భక్తితో నిర్వహిస్తుంటారు. కొత్త వస్తువులు కొనుక్కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతుంటారు. దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, సెల్ ఫోన్లు..ఇలా ఎన్నింటినో కొంటుంటారు. వినియోగదారులను అట్రాక్ చేయడానికి పలు వ్యాపార సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఆన్‌లైన్ కొనుగోళ్లలో మంచి పేరు గడించిన సంస్థలు కూడా ఆఫర్స్ వెల్లడిస్తున్నాయి. 

అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించాయి. ఆన్‌‌లైన్ షాపింగ్ లవర్స్ తమకు కావాల్సిన ఐటమ్స్ ఎంచుకుంటున్నారు. పండగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్‌ పోర్టల్స్‌ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించారు. ఉత్తమ బ్రాండ్లకు చెందిన అన్ని రకాల పెద్ద ఉపకరణాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లతోపాటు, మరిన్ని బ్యాంకు ఆఫర్లు, క్యాష్ బ్యాక్‌లను కూడా అందిస్తున్నాయి. 

Read More : బార్బీ బొమ్మ మారింది

కొన్ని మొబైల్స్‌పై మునుపెన్నడూ చూడని ఆఫర్లు పొందుపరిచారు. సాధారణ యూజర్లకు సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న ఈ ఆఫర్ల పండుగ ప్రైమ్ వినియోగదారులకు 12 గంటల ముందే..సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభమైంది. భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఆన్ లైన్ వినియోగదారులు కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నారు.