Oppo Reno 12 : ఒప్పో రెనో 12పై దుమ్మురేపే డిస్కౌంట్.. భారీ తగ్గింపుతో ఈ ఫోన్ ఇలా కొనేసుకోండి.. డోంట్ మిస్..!

Oppo Reno 12 : ఒప్పో రెనో 12 అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ అద్భుతమైన డీల్ ఆఫర్ చేస్తోంది. ఇంతకీ ఎలా పొందాలంటే?

Oppo Reno 12

Oppo Reno 12 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో రెనో 12పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ స్టైలిష్ ఫోన్‌ (Oppo Reno 12)పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఒప్పో రెనో 12పై రూ. 13వేల కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.

Read Also : Property Registration : త్వరలో కొత్త చట్టం.. ఇకపై మీ ప్రాపర్టీని ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. ఫుల్ డిటెయిల్స్..!

కొత్త ఫోన్ కొంటున్నా లేదా ఎవరికైనా గిఫ్ట్‌గా ఇస్తున్నా ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒప్పో రెనో 12 డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో రెనో 12 ధర రూ.32,999 కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,999కు అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఒప్పో రెనో 12పై రూ.12వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ఈఎంఐపై అదనంగా రూ.1,250 డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.

ఒప్పో రెనో 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో రెనో 12 5G ఫోన్ 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇంకా, గొరిల్లా గ్లాస్ విక్టస్ 7i ప్రొటెక్షన్‌తో వస్తుంది.

హుడ్ కింద, ఒప్పో రెనో 12 మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ చిప్‌సెట్‌తో అమర్చి ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5000mAh బ్యాటరీతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో రెనో 12 ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.

Read Also : Mutual Funds : మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి రూ. 8 లక్షలు పెట్టుబడి పెడితే.. ఎన్ని ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదిస్తారంటే? ఫుల్ డిటెయిల్స్..!

ఫ్రంట్ సైడ్ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా ఉంది. రెనో 12 ధ బెస్ట్ ఫేస్, ఏఐ రైటర్, ఏఐ రికార్డింగ్ సమ్మరీ, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్టూడియో వంటి అనేక ఏఐ ఫీచర్లను కలిగి ఉంది.