Oppo Reno 13 5G Price : ఒప్పో ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. మీ బడ్జెట్ ధరలో స్టైలిష్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. రూ. 40వేల లోపు అత్యుత్తమ ఫోన్‌లలో ఒప్పో రెనో 13 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో భారీ ధర తగ్గింపుతో లభ్యమవుతుంది. ఈ ఒప్పో రెనో 13 5జీ ఫోన్ ఫస్ట్ రూ. 37,999కి లాంచ్ అయింది.
2/5
ఇప్పుడు ఈ ప్రీమియం మిడ్-బడ్జెట్ ఫోన్ ఇప్పుడు రూ. 25వేల కన్నా తక్కువకు అమ్ముడవుతోంది. ఆకర్షణీయమైన డిజైన్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే కెమెరా సెటప్‌తో రెనో 13 5G హై-ఎండ్ మోడళ్లతో పోటీపడుతోంది. మొబైల్ ఫొటోగ్రఫీ, గేమింగ్ లేదా మల్టీ టాస్కింగ్ కోసమైనా ఈ ఫోన్ ఆల్ రౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. అమెజాన్‌లో ఒప్పో రెనో 13 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/5
అమెజాన్‌లో ఒప్పో రెనో 13 డీల్ : భారత మార్కెట్లో రూ.37,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన ఒప్పో రెనో 13 ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.23,999కే అందుబాటులో ఉంది. మీకు రూ.14వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేసి అదనపు డిస్కౌంట్ పొందే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. తుది ధరను మరింత తగ్గిస్తుంది.
4/5
ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు : రెనో 13 5G ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు 1,200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 8350 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB వరకు LPDDR5X ర్యామ్, 256GB యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
5/5
ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,600mAh బ్యాటరీని కలిగి ఉంది. IP66, IP68, IP69 రేటింగ్ కూడా కలిగి ఉంది. ఫొటోల విషయానికి వస్తే.. ఒప్పో రెనో 13లో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ బ్యాక్ సైడ్ 2MP మోనోక్రోమ్ సెన్సార్, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.