Dream Home : హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. సొంత ఇల్లుకు రూ. కోటి కావాల్సిందే..!

సొంతింటి కోసం ఎంతైనా వెచ్చించేందుకు జనం ముందుకు వస్తుండటంతో హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్టులు డెవలప్‌ అవుతున్నాయి.

Own Housing prices Increase in Hyderabad City

Dream Home : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. చిన్నచిన్న ఇళ్ల నిర్మాణం నుంచి సిటిలో అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల వరకు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వివిధ రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి. సొంతింటి కోసం ఎంతైనా వెచ్చించేందుకు జనం ముందుకు వస్తుండటంతో హైదరాబాద్‌లో భారీ ప్రాజెక్టులు డెవలప్‌ అవుతున్నాయి. ఆఫీస్‌ వర్క్‌ నుంచి రిలీఫ్‌ అయ్యేందుకు ఇంటిలో ఆహ్వాదకరమైన వాతావరణాన్ని జనం కోరుకుంటున్నారు. దీంతో కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి.

తగ్గేదే లే అంటున్న హైదరాబాదీలు :
భూముల ధరలతో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో ప్రాపర్టీల రేట్లు చుక్కలనంటుతున్నాయి. అయినా ప్రాపర్టీలకు డిమాండ్‌ మాత్రం తగ్గడం లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచి కోటి రూపాయల రేంజ్‌లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌ భారీగా పెరిగాయని చెప్తున్నారు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌. కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్స్‌ 2023లో 8 శాతం ఉండగా.. ఈ ఏడాది ఇది 14 శాతానికి పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి.

ఇక కోరుకున్న చోట కనీస సౌకర్యాలు కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్ రూం ప్రాపర్టీ కావాలంటే కోటి రూపాయల కంటే అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సరాసరిగా చదరపు అడుగు ధర ఐదు వేల రూపాయల వరకు ఉంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఈ విలువ 10వేలు, అంతకు మించి కూడా ఉంది.

నిర్మాణ వ్యయం పెరగడమే కారణం :
కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ఇళ్ల నిర్మాణం చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. లే అవుట్‌లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లు, ఫుట్‌పాత్‌, గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌజ్, జిమ్, పార్కులు, ఆటస్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి ఎమినిటీస్‌కు కొనుగోలుదారులు పెద్ద పీట వేస్తున్నారు.

ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇక సిటిలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌, ఓఆర్‌ఆర్‌ ప్రాంతాల్లో ఆకాశ ఆర్మ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో ఇళ్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి.

Read Also : Hyderabad North : రియాల్టీ జోష్‌.. హైదరాబాద్‌లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం

ట్రెండింగ్ వార్తలు