PAN Card Suspend : బిగ్ బ్రేకింగ్.. ఏప్రిల్ 1 నుంచి మీ PAN కార్డు చెల్లదు.. అర్జెంట్‌గా ఇలా అప్‌డేట్ చేయండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
PAN Card Suspend : మీ పాన్ కార్డ్ ఏప్రిల్ 1 నుంచి రద్దు కాబోతుంది. మీ ఆధార్, పాన్ వివరాలు సరిపోలకపోతే ఏ క్షణమైనా పాన్ కార్డు క్యాన్సిల్ అవ్వొచ్చు. పాన్ కార్డు వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published On : March 30, 2026 / 06:19 PM IST
PAN Card Suspend
- ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ అమల్లోకి
- ఆధార్, పాన్ కార్డు వివరాలు మ్యాచ్ కాకుంటే పాన్ రద్దు
- మీ ఇంటి నుంచే పాన్ కార్డు వివరాలను అప్‌డేట్ చేయొచ్చు
PAN Card Suspend : మీకు పాన్ కార్డు ఉందా? తస్మాత్ జాగ్రత్త.. మీ పాన్ కార్డు ఇలా ఉంటే ఇక చెల్లదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ రాబోతున్నాయి. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు మ్యాచ్ కాకపోతే పాన్ కార్డు వెంటనే రద్దు అవుతుంది.
అందుకే మీ పాన్ కార్డు, ఆధార్ పేరు మ్యాచ్ కాకుంటే వెంటనే సరిచేయించుకోండి. ఏప్రిల్ ఒకటో తేదీలోపు చేయించుకోవడం బెటర్. ఒకసారి కొత్త రూల్స్ అమల్లోకి వస్తే మీ పాన్ కార్డు పనిచేయదు. మీ పాన్, ఆధార్ కార్డులపై పేర్లు సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. మీ ఫోన్ ద్వారా ఇంటి నుంచే మీ పాన్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
పాన్, ఆధార్‌లో పేరు మ్యాచ్ కాకపోవడం :
ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డుపై పేరు మీ ఆధార్ కార్డుపై పేరు ఒకేలా ఉండాలి. లేదంటే పాన్ కార్డు చెల్లదు. ఒకవేళ మీ పాన్ కార్డు, ఆధార్ కార్డులపై పేర్లు వేరుగా ఉంటే మీ పాన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. అందుకే మీ పాన్ కార్డును తప్పనిసరిగా అప్‌డేట్ చేయడం ముఖ్యం. ఇందుకోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఇదంతా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి నుంచే చేసుకోవచ్చు.
మీరు కేవలం NSDL, UTIITSL అధికారిక వెబ్‌సైట్‌లను విజిట్ చేస్తే చాలు. కొన్ని దశల్లోనే మీ పాన్ కార్డును అప్‌డేట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ఏ విధమైన అప్‌డేట్ కోసమైనా ఇ-కేవైసీ (e-KYC) విధానాన్ని ఎంచుకుంటే త్వరగా పూర్తవుతుంది.
ఈ డాక్యుమెంట్లు అవసరం పడొచ్చు :
మీ పాన్ కార్డును అప్‌డేట్ చేసేందుకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఐడెంటిటీ డాక్యుమెంట్లను రెడీగా పెట్టుకోండి. మీ అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పవర్ లేదా వాటర్ బిల్లు, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్, పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్, రెంట్ అగ్రిమెంట్ లేదా పాస్‌పోర్ట్ కూడా అవసరం కావచ్చు.
మీ పుట్టిన తేదీని మార్చుకునేందుకు మీ ఆధార్ కార్డు, మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, హైస్కూల్ మార్క్‌షీట్ లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం కావచ్చు.
మీ పాన్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలి? :
- మీ పాన్ కార్డులో ఏవైనా మార్పులు చేసేందుకు Protean (గతంలో NSDL) లేదా UTIITSL వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ‘Online PAN Application’ సెక్షన్ వద్ద ‘Changes or Correction in Existing PAN Data’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
- “Individual” వంటి మీ కేటగిరీన ఎంచుకుని మీ పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వివరాలను ఇవ్వండి.
- ఫారమ్‌ను సమర్పించిన తర్వాత మీకు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. అది రాసి పెట్టుకోండి.
- మీ అప్లికేషన్ మెథడ్ ఎంచుకోండి. ఇ-కేవైసీ, ఇ-సైన్‌ల మధ్య ఎంచుకోవచ్చు.
- ఫిజికల్ డాక్యుమెంట్ల అవసరం లేకుండా మీ ఆధార్ కార్డు ద్వారా ఓటీపీని పొందవచ్చు.
- మీరు ఎడిట్ చేసే సమాచారం ఉండే బాక్సులను టిక్ చేయండి.
- పేరు, ఫోటో లేదా పుట్టిన తేదీని ఎంచుకోవచ్చు.
- సరైన సమాచారాన్ని ఎంటర్ చేసి ‘Next’పై క్లిక్ చేయండి.
- అప్‌డేట్ డేటా వెరిఫై కోసం మీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- పాన్ కార్డు ఎడిటింగ్ కోసం ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- రూ. 110తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
- పేమెంట్ చేశాక మీ ఆధార్ కార్డును వెరిఫై చేయండి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఎంటర్ చేశాక మీ ఫారంపై ఇ-సైన్ చేయాలి.
తప్పక గుర్తుంచుకోండి :
ఆధార్‌లో మీ పేరును వివాహం తర్వాత మార్చుకుంటే మీ భర్త పేరు ఉన్న మ్యారేజీ సర్టిఫికేట్ లేదా పాస్‌పోర్ట్‌ను సమర్పించవలసి ఉంటుంది. మీరు చట్టబద్ధంగా మీ పేరు మార్చుకుంటే గెజిట్ నోటిఫికేషన్ కాపీ తప్పనిసరి. అదే మీ పేరు మారకుండా కేవలం స్పెల్లింగ్ లేదా చిన్నపాటి మార్పులు మాత్రమే చేస్తే పైన చెప్పిన విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
