Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియో కొనాలంటే ఫస్ట్ ఈ 3 లెక్కలు తెలుసుకోండి.. మీ జీతం, డౌన్ పేమెంట్, నెలకు EMI ఎంతంటే?
Mahindra Scorpio : మహీంద్రా స్కార్పియో SUV కొంటున్నారా? మీ జీతం సరిపోతుందా లేదా? స్కార్పియో కొనేందుకు ఎంత డబ్బు కావాలి? నెలకు ఈఎంఐ ఎంత కట్టాలో వివరంగా తెలుసుకుందాం..
Mahindra Scorpio
- మహీంద్రా స్కార్పియో SUV మార్కెట్ ధర ఎంతో తెలుసా?
- ఈ లగ్జరీ కారు కొనాలంటే మీ జీతం ఎంత ఉండాలి?
- నెలకు ఈఎంఐ ఎంత కట్టాలి? డౌన్ పేమెంట్, ఇతర ఖర్చులేంటి?
Mahindra Scorpio : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మీరు మహీంద్రా కారు లవర్స్ అయితే ఇది మీకోసమే.. కొత్త మహీంద్రా SUV కార్లలో మహీంద్రా స్కార్పియో టాప్ ప్లేసులో ఉంది. ఈ కారు కొనాలంటే లక్షల్లో డబ్బులు పోయాల్సిందే.
అందులోనూ లక్షలాది మందికి ఇష్టమైన కారుగా అన్ని వయస్సుల వారిని తెగ ఆకట్టుకుంటోంది. 2026లో స్కార్పియోను కొనాలంటే ముందుగా మీ జీతం ఎంత ఉందో చెక్ చేసుకోండి. నెలకు ఈఎంఐ ఎంత కట్టాలి? పూర్తి లెక్కలను వివరంగా పరిశీలిద్దాం..
ధర, డౌన్ పేమెంట్ ఎంతంటే? :
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ప్రారంభ ధర సుమారు రూ. 13 లక్షలు (ఎక్స్-షోరూమ్), టాప్-స్పెషిఫికేషన్లతో మోడల్ ధర రూ. 16.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధరలు, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, పన్నులతో కలిపి రూ. 15.50 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.
ఈఎంఐ లెక్కలివే :
మీరు స్కార్పియో బేస్ మోడల్ ఎంచుకుని డౌన్ పేమెంట్‌గా సుమారు రూ. 3.5 లక్షలు కడితే దాదాపు రూ. 12 లక్షల లోన్ తీసుకోవాల్సి వస్తుంది.
Read Also : EPFO 3.0 : పీఎఫ్ ఖాతాదారులకు పండగే.. ఏప్రిల్ 1 నుంచి UPI ద్వారా PF డబ్బులు తీసుకోవచ్చు.. ఎలాగంటే?
ఈఎంఐ ఎంత కట్టాలంటే? :
మీరు 5 ఏళ్ల కాలానికి 9శాతం వడ్డీ రేటుతో రూ. 13 లక్షల లోన్ తీసుకున్నారనుకుందాం.. మీ ఈఎంఐ నెలకు సుమారు రూ. 25,000 ఉంటుంది. అప్పుడు స్కార్పియో వంటి భారీ కార్లకు నెలవారీ ఫ్యూయిల్, మెయింట్ నెన్స్ ఖర్చులు రూ. 8వేల నుంచి రూ. 10వేల వరకు ఉంటాయి.
మీ జీతం ఎంత ఉండాలి? :
ఆర్థిక నిపుణుల 20/4/10 రూల్ ప్రకారం.. మీ కారు ఈఎంఐ మీ మొత్తం నెల చేతికి అందే జీతంలో 15శాతం నుంచి 20శాతం అసలు మించకూడదు. మీ ఈఎంఐ రూ. 25,000 అయితే.. నెల చేతికి అందే జీతం కనీసం రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.50 లక్షల వరకు ఉండాలి. ఒకవేళ మీ జీతం రూ. 80,000 నుంచి రూ. 100,000 మధ్య ఉంటే ఈఎంఐ భారాన్ని తగ్గాలంటే డౌన్ పేమెంట్ మొత్తం కనీసం రూ. 6 నుంచి రూ. 7 లక్షలు చెల్లించాలి.
తప్పక ఈ విషయాలు గుర్తుంచుకోండి :
కారు కొనడమంటే కేవలం ఈఎంఐలు కట్టడం కాదు.. స్కార్పియోపై భారీ వార్షిక బీమా ప్రీమియం, సర్వీసింగ్ ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే మీకు ఇప్పటికే హోం లోన్ లేదా ఇతర అప్పులు ఉంటే మాత్రం మీ బడ్జెట్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి.
