PF Employees
PF Employees : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రధాని మోదీ ప్రభుత్వం యూపీఎస్ విధానం తీసుకొచ్చినప్పటి నుంచి ఉద్యోగుల కనీస పెన్షన్ పెంపుపై తీవ్ర చర్చ జరుగుతోంది.
ఉద్యోగుల కనీస పెన్షన్ రూ.7,500కి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఉద్యోగులకు ఇచ్చే కనీస పెన్షన్ మొత్తం రూ.1000గా ఉంది. ఇది రూ.6500 పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇలా చేస్తే.. పీఎఫ్ ఉద్యోగులకు బూస్టర్ డోస్ అని చెప్పొచ్చు.
ప్రభుత్వం నుంచి అందుతున్న నివేదికల ప్రకారం.. పెన్షన్‌లో భారీగా పెరుగుదల ఉండవచ్చు. అయితే, ప్రభుత్వం అధికారికంగా పెంపుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. రాబోయే రోజుల్లో ఈపీఎస్ కింద పొందే పెన్షన్ పొందవచ్చు.
ఉద్యోగులకు పెన్షన్ :
ఈపీఎస్ కింద ప్రభుత్వం ప్రతి నెలా ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది. ఈపీఎస్ పథకం నవంబర్ 16, 1999న ప్రారంభించింది. వ్యవస్థీకృత రంగాలలో పనిచేసే వారి కోసం ఈపీఎఫ్ఓ ప్రారంభించింది.
ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కూడా జీవన వ్యయాలకు పెన్షన్ నుంచి ప్రయోజనం పొందవచ్చు.
పెన్షన్ వ్యవస్థ ఏంటో తెలుసా? :
ప్రస్తుతం, ఉద్యోగి పదవీ విరమణ తర్వాత EPS కింద కనీస పెన్షన్‌గా రూ. 1000 నుంచి రూ. 2వేల వరకు ఇస్తున్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2014న బడ్జెట్ కేటాయింపు అందించింది.
దాదాపు 13 ఏళ్లు గడిచాయి. ఈపీఎఫ్ఓ ఇప్పటివరకు ఎలాంటి మార్పు చేయలేదు. 2025లో ఏ నెలలోనైనా రివ్యూ పూర్తయ్యే అవకాశం ఉంది. వెంటనే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రతి ఏడాది వడ్డీ :
ప్రభుత్వం ఉద్యోగులకు వివిధ ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి వడ్డీ డబ్బును కూడా అందిస్తోంది.
Read Also : Hallmark Gold : మీరు కొనే బంగారం మంచిదేనా? స్వచ్ఛత ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు..!
2024, 2025 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు వడ్డీ మొత్తం ఉద్యోగుల ఖాతాల్లోకి వస్తుంది. రూ. 7 కోట్లకు పైగా కుటుంబాలు ప్రయోజనాన్ని పొందుతున్నాయి.