Pixel 6a and Nothing Phone (1) to get massive discount during Flipkart Big Billion Days sale
Flipkart Big Billion Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అతి త్వరలో ఫెస్టివల్ సేల్‌ను ప్రారంభించనుంది. రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ద్వారా ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్లను అందించనుంది. ఈ సేల్ డేట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, సెప్టెంబరు 13న ఫెస్టివల్ సేల్ ప్రారంభమవుతుందని ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
Flipkart ఈ నెలాఖరు వరకు సేల్ ఈవెంట్‌ను నిర్వహించనుందని భావిస్తున్నారు. సేల్ ప్రారంభానికి ముందు.. Flipkart ప్లాట్ ఫారంలో గూగుల్ బ్రాండ్ Pixel 6a, Nothing Phone (1)తో సహా 5G ఫోన్ (5G Smartphones)లపై కొన్ని డీల్ అందించనుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా గూగుల్ పిక్సెల్ 6A (Google Pixel 6a) భారీ తగ్గింపుతో లిస్టింగ్ వెల్లడించింది.
Pixel 6a and Nothing Phone (1) to get massive discount during Flipkart Big Billion Days sale
ఈ డివైజ్ ధర రూ. 27,699కి అందుబాటులో ఉంటుంది. చాలా ఆకర్షణీయమైన డీల్‌తో Pixel 6a రూ. 40వేల రేంజ్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ధర 6GB RAM + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ డివైజ్‌పై అందించనుంది. మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్ భారత మార్కెట్లో రూ.43,999 ప్రారంభ ధరతో వచ్చింది. అంటే.. Flipkart Pixel 6aపై రూ. 16,300 డిస్కౌంట్ అందించనుంది. ఇదే భారీ డిస్కౌంట్ ఆఫర్.
అయితే, ఈ ప్లాట్‌ఫారమ్ రూ. 16,300 ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ-కామర్స్ దిగ్గజం ఎలాంటి వివరాలను అందించలేదు. అయితే ఆఫర్ బ్యాంక్ కార్డ్‌లపై ఆధారపడి ఉంటుందని, హ్యాండ్‌సెట్‌పై కూడా కొంతవరకు డిస్కౌంట్ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా, నథింగ్ ఫోన్ (1) (Nothing Phone (1) భారత మార్కెట్లో రూ. 28,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.
Pixel 6a and Nothing Phone (1) to get massive discount during Flipkart Big Billion Days sale
ఈ డివైజ్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Sale)లో రూ. 33,999కి అందుబాటులో ఉంటుంది. అంటే.. నథింగ్ ఫోన్ (1)పై కస్టమర్‌లు రూ. 5,000 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్ బ్యాంక్ కార్డ్‌పై ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాదు.. 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ Pixel 6a, నథింగ్ ఫోన్ రెండింటిలోనూ ఛార్జర్‌ని అందించడం లేదు. మీరు ఈ రెండింట్లో ఏ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినా సపరేటుగా ఒక ఛార్జర్‌ను కొనుగోలు చేసేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.