Flipkart Electronics Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదిగో టాప్ 10 ఫోన్ డీల్స్ మీకోసం.. డోంట్ మిస్..!

Flipkart Electronics Sale : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Electronics Sale) మరో సేల్ ఈవెంట్‌తో వచ్చేసింది. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ సేల్ (Independence Day Sale 2022) ముగిసింది. ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్స్ సేల్ ఈవెంట్ సందర్భంగా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Electronics Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇదిగో టాప్ 10 ఫోన్ డీల్స్ మీకోసం.. డోంట్ మిస్..!

Flipkart Electronics Sale _ Top 10 phone deals you can’t miss, You Must Know these Deals

Flipkart Electronics Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart Electronics Sale) మరో సేల్ ఈవెంట్‌తో వచ్చేసింది. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ సేల్ (Independence Day Sale 2022) ముగిసింది. ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్స్ సేల్ (Flipkart Electronics Sale) ఈవెంట్ సందర్భంగా కొన్ని స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది. iphone 12, Samsung Galaxy F23, Motorola G52, iphone 13 సహా మరిన్నింటిలో డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకోసం టాప్ 10 స్మార్ట్ ఫోన్ల డీల్స్ అందిస్తున్నాం. Flipkartలో మరిన్నింటిని చెక్ చేయొచ్చు.

Flipkart Electronics Sale : టాప్ 6 ఫోన్ డీల్స్ ఇవే :
ఆపిల్ ఐఫోన్ 12 భారీ తగ్గింపు ధరతో వస్తోంది. 2021లో ఇదే ఐఫోన్ 12 ధర తగ్గింది. ఇదే ఐఫోన్ రూ. 65,900కి అందుబాటులోకి వచ్చింది. కానీ, ఇప్పుడు రూ.53,999 ప్రారంభ ధరతో ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో అందుబాటులోకి వచ్చింది. అంటే కస్టమర్లకు రూ.11,901 తగ్గింపు ధరతో లభిస్తోంది. ఐఫోన్ 12 పాత స్మార్ట్‌ఫోన్ (64GB స్టోరేజ్ మోడల్) తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. Samsung Galaxy F23 ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో రూ. 17,499 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

Flipkart Electronics Sale _ Top 10 phone deals you can’t miss, You Must Know these Deals

Flipkart Electronics Sale _ Top 10 phone deals you can’t miss

5G స్మార్ట్‌ఫోన్, స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో వస్తోంది. 5,000mAh బ్యాటరీ, 50-MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.6-అంగుళాల స్క్రీన్, మరిన్ని ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ బాక్సులో ఛార్జర్‌ను అందించడం లేదు. ఇందుకోసం ఛార్జర్ విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. Samsung 25W ఛార్జింగ్‌కు సపోర్ట్‌ అందిస్తోంది. మోటరోలా G52 అసలు ధర రూ. 14,499కి అందుబాటులో ఉంది.

అయితే, మీరు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్ సందర్భంగా ఐఫోన్ 13 ఆన్‌లైన్‌లో కేవలం రూ.73,999కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 వాస్తవానికి రూ.79,900కి లాంచ్ అయింది. ఫ్లిప్ కార్ట్ సేల్ ద్వారా iPhone 13పై రూ. 5,901 డిస్కౌంట్ పొందవచ్చు. మరోవైపు అమెజాన్ ఇదే డివైజ్‌ను చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. వినియోగదారులు ఐఫోన్ 13 సిరీస్‌ను రూ. 70,900కి కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డ్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. తద్వారా మీరు ఐఫోన్‌ను చాలా తక్కువ ధరకు పొందవచ్చు.

Flipkart Electronics Sale _ Top 10 phone deals you can’t miss, You Must Know these Deals

Flipkart Electronics Sale _ Top 10 phone deals you can’t miss

అంతేకాదు.. స్మార్ట్‌ఫోన్ కావాలనుకునే కొనుగోలుదారులు Realme C11 (2021) మోడల్‌ను తీసుకోవచ్చు. ఎందుకంటే.. ఇది ఎంట్రీ-లెవల్ ఫోన్, ఫ్లిప్‌కార్ట్‌లో పాత ధర రూ.7,499కి విక్రయిస్తోంది. SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ధర రూ. 6,950 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ విలువ మీ ఫోన్ కండీషన్, ఎన్నేళ్లుగా వాడుతున్నారు అనే ఆధారంగా ఉంటుందని గుర్తుంచుకోండి.

మీరు అన్ని ఆఫర్‌లతో Realme C11ని కొంచెం తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. Moto G32 ఫ్లిప్‌కార్ట్‌లో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 11,999 తగ్గింపు ధరతో పొందవచ్చు. SBI బ్యాంక్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపు కూడా ఉంది. వాస్తవానికి హ్యాండ్‌సెట్ రూ. 12,999కి ఫ్లిప్ కార్ట్‌లో లిస్టు అయింది. ఏది ఏమైనా మీరు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం.. త్వరపడండి.. డోంట్ మిస్..

Read Also : McLaren Luxury Cars : భారత్‌కు ‘మెక్‌లారెన్‌’ సూపర్‌ లగ్జరీ కార్లు వచ్చేస్తున్నాయి.. ఎప్పుడంటే?