×
Ad

Buying House Guide : కొత్త ఇల్లు కొంటున్నారా? చౌకైన హోం లోన్లు అందించే బ్యాంకులివే.. ఎందులో వడ్డీ తక్కువంటే?

Buying Home Guide : కొత్త ఇల్లు కొనేవారి కోసం మార్కెట్లో అనేక బ్యాంకులు సరసమైన ధరకే హోం లోన్లను అందిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు అందించే గృహ రుణ వడ్డీ రేట్లపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published On : February 23, 2026 / 05:23 PM IST

Buying Home Guide

  • కొత్త ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా?
  • తక్కువ వడ్డీకే కొత్త హోం లోన్లు అందించే బ్యాంకులివే
  • ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఏయే బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయ్
  • హోం లోన్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు

Buying Home Guide : సొంతిల్లు అనేది ప్రతిఒక్కరి కల. ప్రస్తుత రోజుల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొత్త ఇల్లు కొనాలంటే సామాన్య మధ్యతరగతి వాళ్లకు కష్టంగా మారుతోంది. కొత్త ఇల్లు కొనేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం. అందుకే చాలామంది ఇళ్లు కొనుగోలుదారులు బ్యాంకు రుణాలపై ఆధారపడుతుంటారు. బ్యాంకుల నుంచి పొందే గృహ రుణాలతో తమకు నచ్చిన కొత్త ఇంటిని కొనుగోలు చేస్తుంటారు.

మీరు కూడా భవిష్యత్తులో గృహ రుణం కోసం ప్లాన్ చేస్తుంటే.. ఫస్ట్ వివిధ బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్ల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత తక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకు నుంచి గృహ రుణాన్ని ఎంచుకోవాలి.

దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్లకు సంబంధించి పూర్తి వివరాలను కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఏయే బ్యాంకు హోం లోన్లపై ఎంత మొత్తంలో వడ్డీ రేట్లు అందిస్తున్నాయి? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Read Also : iPhone 17e Price : ఐఫోన్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేస్తోందోచ్, లాంచ్‌కు ముందే ధర, ఫుల్ ఫీచర్లు లీక్

ప్రభుత్వ రంగ బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్లు :

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) : 7.25 శాతం
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) : 7.10 శాతం
  • కెనరా బ్యాంక్ : 7.15 శాతం
  • పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ : 7.30 శాతం
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : 7.10 శాతం
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 7.15 శాతం
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : 7.10 శాతం

ప్రభుత్వ బ్యాంకు నుంచి వచ్చే ఈ వడ్డీ రేట్లు ప్రారంభ వడ్డీ రేట్లతో పాటు మీ సిబిల్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేట్లు మారవచ్చు.

ప్రైవేట్ బ్యాంకుల గృహ రుణ వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే?స

  • ఐసిఐసిఐ బ్యాంక్ : 7.45 శాతం
  • HDFC బ్యాంక్ : 7.75 శాతం
  • యాక్సిస్ బ్యాంక్ : 8 శాతం
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ : 7.70 శాతం
  • బంధన్ బ్యాంక్ : 8.41 శాతం
  • హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ : 7.45 శాతం

ఈ వడ్డీ రేట్లు కూడా ప్రారంభ వడ్డీ రేట్లు మాత్రమే.. మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి ఈ వడ్డీ రేట్లు కూడా మారవచ్చు.

హోం లోన్ ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే :
గృహ రుణం అనేది అతి దీర్ఘకాలిక రుణం. అందుకే బ్యాంకును జాగ్రత్తగా ఎంచుకోండి. వడ్డీ రేట్లలో ఒక శాతం వ్యత్యాసం కూడా మీకు లక్షల రూపాయలు ఆదా చేస్తుంది. బ్యాంకుల వడ్డీ రేట్లతో పాటు ప్రాసెసింగ్ ఫీజులు, పెనాల్టీలు వంటి వివిధ ఛార్జీలను లెక్కించాలి. వడ్డీని ఆదా చేయాలంటే తక్కువ సంవత్సరాలకు లోన్ టర్మ్ పెట్టుకోండి.