Budget Smart TV Prices : బడ్జెట్ టీవీలకు బ్యాడ్ న్యూస్.. 32, 43 ఇంచ్ టీవీల ధరలు భారీగా పెరగనున్నాయ్! ఇప్పుడే కొనండి!
Budget Smart TV Prices : ప్రపంచవ్యాప్తంగా మెమరీ కొరత ప్రభావంతో 32, 43 అంగుళాల బడ్జెట్ టీవీల ధరలు భారీగా పెరగనున్నాయి. ఇదే విషయాన్ని హిసెన్స్ ఇండియా సీఈఓ హెచ్చరించారు.. ధరల పెంపునక కారణాలు ఇవే..
- Sreehari A
- Published on- August 23, 2026 / 01:10 PM IST
Budget Smart TV Prices
- 32, 43 అంగుళాల త్వరలో ఖరీదైనవిగా మారనున్న టీవీలు
- ప్రపంచవ్యాప్తంగా మెమరీ కొరత కారణంగా టీవీల ధరలు పెంపు
- ధరలపై హైసెన్స్ ఇండియా సీఈఓ పంకజ్ రాణా హెచ్చరిక
Budget Smart TV Prices : మీకు కొత్త స్మార్ట్‌టీవీ కొనాలని ఉందా? అయితే, ఇప్పుడే కొనేసుకోండి.. లేటు చేస్తే రేట్లు పెరిగిపోతాయి జాగ్రత్త.. త్వరలోనే స్మార్ట్ టీవీల ధరలు అమాంతం పెరిగిపోనున్నాయి. గత కొన్ని రోజులుగా స్మార్ట్‌ఫోన్ ధరలు వేగంగా పెరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు స్మార్ట్ టీవీల ధరలు కూడా పెరగబోతున్నాయంటూ ప్రముఖ టీవీ కంపెనీ సీఈఓ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా మెమరీ కొరత కారణంగా టీవీ ధరలు కూడా భారీగా పెరగబోతున్నాయని అన్నారు. అందుకే మీరు కొత్త టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే ముందుగానే తీసుకోవడం ఎంతైనా మంచిది. లేదంటే ఆ తర్వాత (Budget Smart TV Prices) బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
స్మార్ట్ టీవీ మార్కెట్‌లో 32 అంగుళాల నుంచి 85 అంగుళాల వరకు స్మార్ట్ టీవీలు, భారీ సైజులతో 100 అంగుళాల వరకు కొన్ని ప్రీమియం టీవీలు కూడా విడుదల అవుతున్నాయి. కానీ, ప్రస్తుత మెమరీ కొరత కారణంగా ఇప్పుడు స్మార్ట్ టీవీ మార్కెట్‌పై భారీ ఎఫెక్ట్ పడనుంది.
Read Also : Apple Layoffs : ఆపిల్‌లో మరోసారి లేఆఫ్స్.. AI దెబ్బకు 200కుపైగా ఉద్యోగాలు ఫట్!
టీవీల ధరల పెంపుపై హైసెన్స్ ఇండియా సీఈఓ పంకజ్ రాణా కీలక సూచన చేశారు. చిన్న టీవీల విభాగంలో టీవీలను తయారు చేసి అమ్మడం ఇప్పుడు కంపెనీలకు కష్టంగా మారుతోంది. దీనికి కారణం మెమరీ సరఫరా తగ్గిపోవడమేని ఆయన అంటున్నారు.
స్పేర్ పార్టుల ధరల ప్రభావం :
చిన్న టీవీ కేటగిరీలో ప్రధానంగా 32-అంగుళాల నుంచి 43-అంగుళాల స్మార్ట్‌టీవీలు ఉంటాయి. ప్రపంచంలోనే టీవీలను అత్యధికంగా వినియోగించే దేశాలలో భారత్ ఒకటి. అయితే, ఇందులో త్వరలో టీవీ ధరలు పెరిగే అవకాశం ఉంది. టీవీ స్పేర్ పార్టులపై కూడా ధరలు పెరిగాయి. దీని ప్రభావం టీవీ ధరలపై కూడా పడనుంది. ముఖ్యంగా, చిన్న టీవీల ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
సీఈఓ రానా ప్రకారం.. దాదాపు ప్రతి టీవీకి మెమరీ అవసరాలు ఒకేలా ఉంటాయి. 43-అంగుళాల టీవీ లేదా 100-అంగుళాల టీవీ అయినా మెమరీ అవసరం 1.5GB నుంచి 2GB లేదా 2.5GBకి కన్నా పెద్దగా పెరగదు. అయితే, పెరుగుతున్న మెమరీ ధరల ప్రభావం 32-అంగుళాల 43-అంగుళాల టీవీలపై పడుతోంది. ఈ ప్రభావం 20 శాతం నుంచి 25 శాతం వరకు ఉండొచ్చు. అయితే, బిగ్ స్క్రీన్ టీవీల విషయానికి వస్తే, ఈ ప్రభావం 5 శాతం కన్నా తక్కువగా ఉంటుంది.
20 నుంచి 25 శాతం పెంపు :
మెమరీ కొరత ఇలానే కొన్నాళ్లు ఉంటే చిన్న 32-అంగుళాల నుంచి 43-అంగుళాల టీవీల ధరలు త్వరలో 20 శాతం నుంచి 25 శాతం వరకు పెరగవచ్చు. ఉదాహరణకు.. ప్రస్తుతం రూ. 20వేలకు లభిస్తున్న 32-అంగుళాల టీవీ భవిష్యత్తులో రూ. 25వేల వరకు పెరగొచ్చు.
అంటే.. చిన్న టీవీల ధరలు రూ. 5వేల వరకు పెరగవచ్చు. అందుకే, మీరు 32 లేదా 43-అంగుళాల టీవీని కొనాలని చూస్తుంటే ధర పెరగకముందే కొనేసుకోవడం బెటర్.. అయితే, ఈ ధరల పెంపు ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందో క్లారిటీ లేదు..
