Plot vs Flat : ఓపెన్ ప్లాట్, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఏది బెస్ట్‌.. ఎందులో ఇన్వెస్ట్‌ చేస్తే అధిక రిటర్న్స్‌ వస్తాయి?

. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తరువాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బావుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు.

plot vs flat apartment or open plot which is best property investment

Apartment or Open Plot for Investment: ఓపెన్‌ ప్లాట్, అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌, కమర్షియల్‌ స్పేస్, రిటైల్‌ స్పేస్.. ఇలా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు చాలా మార్గాలున్నాయి. అయితే రియల్ రంగంలో దేంట్లో పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువ అన్నది చాలా మందికి కలిగే సందేహం. కేవలం రాబడి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్‌లో మన పెట్టుబడికి భద్రత ఎక్కడ ఉంటుందన్నది కూడా చాలా ముఖ్యం. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తరువాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బావుంటుందా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇంటిపై పెట్టుబడి పెట్టడమే మంచిదని రియాల్టీ రంగానికి చెందిన ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మౌలిక వసతులన్నీ ఉన్న ప్రాంతంలో ఇంటి స్థలాల ధరలు అధికంగా ఉన్నాయి. దాని కోసం వెచ్చించే పెట్టుబడిలో సగం ధరలోనే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనొచ్చని రియాల్టీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో స్థలం గజానికి కనీసం లక్ష రూపాయల నుంచి లక్షా 50 వేల రూపాయలుగా ఉంది. అంటే 200 గజాల స్థలం కొనాలంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు కావాలి. అదే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ఒక కోటి రూపాయల నుంచి కోటి 50 లక్షల రూపాయల్లో వస్తుంది. అందుకే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇల్లు కొనుక్కోవడమే బెటరనే అభిప్రాయముంది. అందుకు అనుగుణంగానే నగర శివారు ప్రాంతాల్లో డెవలపర్లు, నిర్మాణ కంపెనీలు అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతుండటంతో డిమాండ్‌ మొదలైంది. ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్‌ ప్లాట్ల కంటే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.

Also Read: సొంతిల్లు కొనేందుకు ఇదే సరైన సమయం.. ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశం

మరోవైపు ఓపెన్ ప్లాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, న్యాయపరమైన అంశాలతో పాటు.. స్థలం భద్రత విషయంలోనూ చిక్కులుంటాలని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ఇదే సమయంలో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటు, అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. ఇక భద్రతతో పాటూ పవర్‌ బ్యాకప్, కార్‌ పార్కింగ్, క్లబ్‌ హౌస్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్, గార్డెన్‌ వంటి కామన్‌ ఎమినిటీస్‌ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి వసతులు అందుబాటులో ఉండటంతో అపార్ట్‌మెంట్‌ కొనుగోళ్లకే చాలా మంది మొగ్గుచూపుతున్నారు.

Also Read: ఇల్లు కొనేటప్పుడు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి?

హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రధాన నగరాల్లో పరిమిత స్థాయిలో స్థలాలకు డిమాండ్‌ ఉంటూ వస్తోంది. అయితే అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌పై కంటే కూడా ఓపెన్ ప్లాట్‌పై రాబడి ఎక్కువే అయినా, అధిక పెట్టుబడి-భద్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఫ్లాటే బెటరని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.