Hyderabad: సొంతిల్లు కొనేందుకు ఇదే సరైన సమయం.. ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశం

హైదరాబాద్‌లో ఇప్పుడు నగరం నడిబొడ్డుతో పాటు నగర శివార్లలోను మౌళిక వసతులు బాగా మెరుగయ్యాయి. దీంతో ఇళ్ల ధరలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి.

Hyderabad: సొంతిల్లు కొనేందుకు ఇదే సరైన సమయం.. ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశం

good time to buy a house in Hyderabad check details in telugu

Own House: సొంతిళ్లు ఉంటే ఆ ధీమానే వేరు. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు అంతా తమ తమ స్థాయిని బట్టి సొంతిళ్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటివరకు అద్దెకు ఉన్నావాళ్లు సైతం ఇప్పుడు సొంతింటి కోసం ఆరాట పడుతున్నారు. ఎవరి స్థాయిని బట్టి, వారి బడ్జెట్‌కు అనుగుణంగా ఎక్కడో ఓ చోటా సొంతిళ్లు కట్టుకోవాలని, లేదా కొనుగోలు చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు.

ప్రాంతం, విస్థీర్ణాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసాలు
ప్రధానంగా హైదరాబాద్‌లో సొంతిల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ఎవరిస్థాయిలో వారు ప్రయత్నిస్తుంటారు. హైదరాబాద్‌లోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటి ఎంపికలో మౌళిక వసతులు, రవాణా సౌకర్యం. త్రాగు నీరు, భద్రత వంటి అంశాలను కొనుగోలుదారులు పరిగణలోకి తీసుకుంటారు. హైదరాబాద్‌లో ఇప్పుడు నగరం నడిబొడ్డుతో పాటు నగర శివార్లలోను మౌళిక వసతులు బాగా మెరుగయ్యాయి. దీంతో ఇళ్ల ధరలు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ క్రమంగా పెరుగుతున్నాయి. భాగ్యనగరంలో ఈ కొత్త యేడాదిలో ఇంటి ధర కనిష్టంగా 40 లక్షల రూపాయలుండగా, గరిష్టంగా 25 కోట్ల రూపాయల విలువైన విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతం, ఇంటి విస్థీర్ణాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసాలున్నాయి.

నగరానికి చేరువలో ధరలు కాస్త ఎక్కువ
హైదరాబాద్ శివార్లలో కనిష్టంగా అపార్ట్‌మెంట్స్‌లో సింగిల్ బెడ్ రూం ప్లాట్ ధర 40 లక్షల రూపాయలుగా ఉంది. శామీర్ పెట్, అల్వాల్, తారామతి పేట, బాచారం, ఘట్ కేసర్ వంటి ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లలో సింగిల్ బెడ్ రూం ఫ్లాంట్ 40 లక్షలు ఉండగా, అదే డబుల్ బెడ్ రూం 44 లక్షల రూపాయలుగా ఉంది. త్రిపుల్ బెడ్ రూం ఫ్లాట్ 48 లక్షల రూపాయలు పలుకుతోంది. అంటే ఎస్‌ఎఫ్‌టీ 3 వేల 400 రూపాయల నుంచి 4వేల రూపాయలుగా ఉంది. మరి కాస్త నగరానికి చేరువలో అయితే ఇంటి ధరలు మరి కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, నాగోల్, పటాన్ చెరు, శంషాబాద్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు ఓ మోస్తరుగా ఉన్నాయి. ఇక్కడ సింగిల్ బెడ్ రూం ధర 50 లక్షలు ఉండగా, డబుల్ బెడ్ రూం ప్లాట్ ధర 58 లక్షలు, త్రిపుల్ మెబ్ రూం ధర 64 లక్షలుగా ఉంది. అంటే ఎస్‌ఎఫ్‌టీ 4 వేల నుంచి 5 వేల 400 రూపాయల వరకు ఉంది.

Also Read: ప్రాపర్టీ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం.. కొంపల్లి, మేడ్చల్‌, శామీర్‌పేట్‌ కారిడార్ బెస్ట్

ఈ ప్రాంతాల్లో ఇళ్లు కొనాలంటే కనీసం కోటి
ఇక హైదరాబాద్‌లో ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇంటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, నల్లగండ్ల, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, మోకిల వంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు కోటి రూపాయల పైమాటే. ఇక్కడ చదరపు అడుగు 8 వేల 500 నుంచి 10 వేల రూపాయల వరకు ఉంది. అంటే ఈ ప్రాంతాల్లో ఇళ్లు కొనాలంటే కనీసం కోటి 20 లక్షల రూపాయలు కావాల్సిందే. గేటెడ్ కమ్యూనిటీలో సౌకర్యాలను బట్టి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో ఒక్కో ఫ్లాట్ ధర 3 నుంచి 6 కోట్ల రూపాయలు కూడా పలుకుతోంది. ఇక విల్లాల సంగతైతే చెప్పక్కర్లేదు. ప్రాంతం, విస్థీర్ణాన్ని బట్టి హైదరాబాద్ లో 5 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల వరకు విల్లాల ధరలున్నాయి.

Also Read: కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 2024 భారత్‌కు వచ్చేస్తోంది.. ఫొటోలు చూశారా?

స్టీల్, సిమెంట్‌తో పాటు నిర్మాణ సంబంధిత ముడి సరకుల ధరలకు అనుగుణంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇళ్ల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశం ఉందని రియాల్టీ ఎక్స్‌పర్ట్స్‌ అభిప్రాయపడుతున్నారు. సొంతిల్లు కొనుక్కునేందుకు ఇదే సరైన సమయమని వారు సూచిస్తున్నారు.