PM Kisan 20th Installment
PM Kisan 20th Installment Date 2025 : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 20వ విడత వచ్చేసింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) లబ్ధిదారుల జాబితా ఆగస్టు 2న శనివారం అధికారిక పీఎం కిసాన్ పోర్టల్‌లో విడుదల అయింది. యూపీలోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాన నరేంద్ర మోదీ కిసాన్ 20వ విడత రూ.2వేలు (PM Kisan 20th Installment) విడుదల చేశారు. మొత్తం రూ. 20వేల కోట్లకు పైగా నిధులు విడుదల అయ్యాయి.
అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు డబ్బులు జమ కానున్నాయి. రూ. 20,500 కోట్ల విలువైన ఈ పథకం 20వ విడతను దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు లబ్ధిపొందనున్నారు. ప్రభుత్వం ప్రధాన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకం 2019లో ప్రారంభించినప్పటి నుంచి 5 ఏళ్లు పూర్తయింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 19 వాయిదాల ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.3.69 లక్షల కోట్లు నేరుగా జమ అయ్యాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుడి స్టేటస్ పొందడం ఎలా? :
అర్హులైన రైతులు ఈ పథకం కింద తదుపరి 20వ విడత డబ్బులను పొందవచ్చు. ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్ ద్వారా ఆన్‌లైన్‌లో లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత విడుదల.. రూ. 2వేలు పడ్డాయి.. ఇప్పుడే మీ అకౌంట్ ఇలా చెక్ చేసుకోండి..!
ఆధార్ కార్డు ద్వారా లబ్ధిదారుని స్టేటస్ చెకింగ్ ఇలా :
మొబైల్ ద్వారా లబ్ధిదారుని స్టేటస్ చెకింగ్ ఇలా :