PM-Kisan 20th Installment : దేశంలోని కోట్లాది మంది రైతులకు బిగ్ అప్‌డేట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత విడుదలపై ఉత్కంఠ నెలకొంది. పీఎం కిసాన్ (PM-Kisan 20th Installment) లబ్ధిదారు రైతులు ఎప్పుడు రూ. 2వేలు విడుదల అవుతాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పీఎం మోదీ 20వ విడత రూ. 2వేలు ఈ నెలలోనే విడుదల చేస్తారని భావిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వాయిదా ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల అవుతుందని సంగతి తెలిసిందే. చివరి 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది. ఆ తర్వాత ఈ మొత్తం జూన్‌లో రావాల్సి ఉంది. కానీ, ఈసారి ఆలస్యం అయింది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడత జూలై 18న విడుదల అయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నివేదికల ప్రకారం.. జూలై 18న మోతీహరిలో జరిగే బహిరంగ సభలో పీఎం నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 9.8 కోట్లకు పైగా రైతుల బ్యాంకు అకౌంట్లలో 20వ విడత రూ. 2వేలు నేరుగా పంపిణీ చేసే అవకాశం ఉంది. ఈలోగా లబ్ధిదారు రైతులు కొన్ని పనులను పూర్తి చేసి ఉండాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
భూమి రికార్డులను ఎలా అప్ డేట్ చేయాలి? :
పీఎం కిసాన్ యోజన బెనిఫిట్స్ పొందడానికి మీ భూమి రికార్డులను అప్‌డేట్ చేసుకోండి.