PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ 22వ విడతకు ముందే బిగ్ షాక్.. 1.13 కోట్ల మంది రైతుల పేర్లు తొలగింపు.. మీ పేరు లిస్టులో ఉందో చెక్ చేశారా?
PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ 22వ వాయిదాపై మార్చి 13వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, ఈసారి పీఎం కిసాన్ జాబితానుంచి 1.13 కోట్ల మంది రైతుల పేర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. మీ పేరు ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
- Sreehari A
- Published On : March 12, 2026 / 05:18 PM IST
PM-Kisan 22nd instalment date
- మార్చి 13న పీఎం కిసాన్ 22వ వాయిదా విడుదల
- కోట్లాది లబ్ధిదారు రైతుల ఖాతాల్లో రూ. 2వేలు జమ
- 1.13 కోట్ల మంది రైతుల పేర్లు తొలగించిన కేంద్రం
- ఈ రైతులు పీఎం కిసాన్ వాయిదా అందుకోలేరు
PM Kisan 22nd instalment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ గుడ్ న్యూస్.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ వాయిదా విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 2వేలు జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న అస్సాంలోని గౌహతి పర్యటన సందర్భంగా 22వ వాయిదాను విడుదల చేయనున్నారు.
ఈ మేరకు అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 2వేలు చొప్పున ఖాతాల్లో జమ కానున్నాయి. లేటెస్ట్ డేటా ప్రకారం.. ఇటీవలి సంవత్సరాల్లో అనుమానిత అనర్హమైన కేసులను వెరిఫై చేసి గుర్తిస్తోంది. ఇలా 1.12 కోట్లకు పైగా పేర్లు లబ్ధిదారు జాబితా నుంచి తొలగించింది ప్రభుత్వం.
11వ విడత (ఏప్రిల్–జూలై 2022) : 10,48,45,164 మంది రైతులకు రూ. 2వేలు అందింది.
21వ విడత (ఆగస్టు–నవంబర్ 2025) : 9,35,79,869 మంది రైతులకు రూ. 2వేలు అందింది.
1.13 కోట్లకు పైగా లబ్ధిదారుల పేర్లు తొలగింపు :
గత వాయిదాల్లో ఈ పథకి కింద లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్రభుత్వ డేటా సూచిస్తోంది. పీఎం కిసాన్ లబ్ధిదారుల డేటాబేస్ నుంచి దాదాపు 1.12 కోట్ల పేర్లును తొలగించింది ప్రభుత్వం. అదనంగా, e-KYC వెరిఫికేషన్ పూర్తి చేయని లబ్ధిదారులకు కూడా వాయిదా అందలేదు. రిజిస్టర్ చేసుకున్న రైతులందరికి e-KYC తప్పనిసరి చేసింది.
పీఎం కిసాన్ పోర్టల్‌లో OTP ఆధారిత e-KYC అందుబాటులో ఉంది. రైతులు బయోమెట్రిక్ e-KYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను కూడా సందర్శించవచ్చు 22వ విడత డబ్బును ఎంత మంది రైతులు అందుకుంటారో వేచి చూడాల్సిందే.
పథకం లబ్ధిదారులకు ప్రయోజనాలివే :
- అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6,000 అందుతుంది.
- ఈ మొత్తాన్ని రూ. 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో పొందవచ్చు
- పేమెంట్లు DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతాయి.
- ఈ పథకం చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ప్రయోజనకరం
- లబ్ధిదారులు e-KYC వెరిఫికేషన్ పూర్తి చేయాలి
పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో పేరును ఎలా చెక్ చేయాలి? :
రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేయవచ్చు.
- పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ను విజిట్ చేయండి.
- ‘Beneficiary List’ పై క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి
- ‘Get Report’పై క్లిక్ చేయండి
- మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది
- ఈ జాబితాలో మీ పేరు కనిపిస్తే మీరు వాయిదాకు అర్హులు.
పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
- రైతులు వాయిదా జమ అయిందో లేదో కూడా ట్రాక్ చేయవచ్చు.
- పేమెంట్ స్టేటస్ చెక్ చేసేందుకు ఇలా చేయండి
- పీఎం-కిసాన్ పోర్టల్‌కి వెళ్లండి
- ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి
- ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
- ‘Get Data’పై క్లిక్ చేయండి
- పోర్టల్ వాయిదాల వివరాలు, పేమెంట్ స్టేటస్ చూడొచ్చు
పీఎం కిసాన్ e-KYC ఎలా పూర్తి చేయాలి? :
- పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ‘e-KYC’పై క్లిక్ చేయండి
- మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని సమర్పించండి
- OTP రాకపోతే బయోమెట్రిక్ e-KYC కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లొచ్చు.
పీఎం కిసాన్ పథకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? :
అర్హత ఉన్న కొత్త రైతులు ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ :
- పీఎం కిసాన్ పోర్టల్‌ని విజిట్ చేయండి.
- ‘New Farmer Registration’ పై క్లిక్ చేయండి
- ఆధార్ నంబర్, అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి
- భూమి రికార్డులు, బ్యాంకు వివరాలను సమర్పించండి
- e-KYC వెరిఫికేషన్ పూర్తి చేయండి
- అర్హత ఉన్న రైతులను లబ్ధిదారుల డేటాబేస్‌లో చేర్చుతారు.
