PM-Kisan 23rd Installment : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 23వ వాయిదా వచ్చేస్తోంది.. ఈ రైతులకు రూ. 2 వేలు పడవు.. స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే?
PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్ యోజన 23వ విడత కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. మీరు అర్హులైన రైతు అయితే ఈ వార్త మీ కోసమే. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Updated on- May 28, 2026 / 06:08 PM IST
PM-Kisan 23rd Installment ( Image Credit : AI )
- పీఎం కిసాన్ 23వ వాయిదాకు ఇకేవైసీ తప్పనిసరి
- ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలి
- ఈకేవైసీ పూర్తి చేయకపోతే రూ. 2వేలు అందుకోలేరు
PM-Kisan 23rd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. 23వ విడత కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఇప్పటివరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద 22 విడతలను విడుదల చేసింది. చివరి విడతను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 13న అస్సోం నుంచి విడుదల చేశారు.
22వ విడతలో ప్రభుత్వం 9 కోట్లకు పైగా రైతుల ఖాతాలకు రూ. 18,640 కోట్ల మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ సమయంలో కూడా చాలా మంది రైతుల ఖాతాలకు 22వ విడత అందలేదు. అదేవిధంగా, కొంతమంది రైతుల ఖాతాలకు 23వ విడతలోని రూ.2వేలు చొప్పున అందవు. ఏయే రైతుల ఖాతాలకు 23వ విడత అందదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఏ రైతులకు రూ. 2వేలు రావంటే? :
పీఎం కిసాన్ లబ్ధిదారులు ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో పొందుతారు. అయితే, కొంతమంది రైతుల నిధులు నిలిచిపోతున్నాయి. కేవైసీ (కీ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్) అసంపూర్తిగా ఉన్న లేదా ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేయని రైతులకు 23వ వాయిదా కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి కిసాన్ యోజన 23వ విడత కోసం అర్హులైన రైతులు ఈకేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈకేవైసీని పూర్తి చేయని రైతులు రూ. 2వేలు అందుకోలేరు. విడత మొత్తాన్ని పొందాలంటే రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు లింక్ చేసి ఉండాలి.
రైతులు (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ఇ-కెవైసి (e-KYC) ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా తమ ఇ-కెవైసిని ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు. ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీ (OTP) ద్వారా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది.
పీఎం కిసాన్ 23వ విడత ఎప్పుడు వస్తుంది? :
పీఎం కిసాన్ యోజన 23వ విడతకు సంబంధించిన అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. 2024లో ఆర్థిక సంవత్సరపు మొదటి విడత జూన్ 18న వచ్చింది. 2025లో మొదటి విడత ఆగస్టు 2న వచ్చింది. గత రికార్డుల ప్రకారం.. ఆర్థిక సంవత్సరపు మొదటి విడత సాధారణంగా జూన్, జూలై మధ్య లేదా ఆగస్టు మొదటి వారంలో వస్తుంది. 23వ విడత కూడా జూన్, జూలై లేదా ఆగస్టు మొదటి వారంలో రావచ్చు.
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
- అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/)ను విజిట్ చేయండి.
- ‘Beneficiary Status’ పేజీకి వెళ్ళండి.
- ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి.
- ‘Get Data’పై క్లిక్ చేయండి.
- బెనిఫిషియరీ స్టేటస్‌ను చెక్ చేయండి.
- పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి.
