PM Kisan : పీఎం కిసాన్ 20వ విడతపై ఉత్కంఠ.. రూ. 2వేలు పడే రైతుల జాబితా ఇదే.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి..!

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ 20వ విడతపై ఉత్కంఠ నెలకొంది. లబ్ధిదారు రైతులు రూ. 2వేల కోసం ఎదురుచూస్తున్నారు..

PM Kisan 20th Installment

PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ పథకం 20వ విడత అతి త్వరలో విడుదల కాబోతుంది. లక్షలాది మంది రైతులు (PM Kisan)  రూ. 2వేలు ఎప్పుడు వస్తాయా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ జూలైలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం కిసాన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. ఈ నెల 19న విడుదల చేసే అవకాశం ఉంది.

గత 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది. ఇంకా 20వ విడత చెల్లింపుకు సంబంధించి అధికారిక ప్రకటన లేదు. పీఎం కిసాన్‌లో పాల్గొనడం నుంచి eKYC ప్రక్రియ పూర్తి, లబ్ధిదారుల జాబితాలో పేరు చేరే వరకు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. తద్వారా DBT ద్వారా రూ. 2వేలు ఎప్పుడు అకౌంటులో పడినా ఎలాంటి సమస్య ఉండదు.

మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ఎలా చెక్ చేయాలి? : 
1. అధికారిక PM కిసాన్ పోర్టల్‌ (https://pmkisan.gov.in) విజిట్ చేయండి.
2. హోమ్‌పేజీలో కొంచెం స్క్రోల్ చేసి ‘FARMERS CORNER’ కింద, ‘Beneficiary List’పై క్లిక్ చేయండి.
3. మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంటర్ చేయండి.
4. మీ గ్రామంలోని లబ్ధిదారుల జాబితా కోసం ‘Get Report’పై క్లిక్ చేయండి.

మీరు సెల్ఫ్ రిజిస్టర్డ్ రైతు అయితే పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? : 
CSC కేంద్రాల ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న రైతులు ఈ కింది విధంగా తమ అప్రూవల్ స్టేటస్ చెక్ చేయవచ్చు.

1. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ (pmkisan.gov.in) విజిట్ చేయండి.
2. హోమ్‌పేజీలో ‘FARMERS CORNER’ కేటగిరీలో ‘Status of Self Registered Farmer/CSC Farmers’పై క్లిక్ చేయండి.
3. మీ ఆధార్ నంబర్‌ ఎంటర్ చేసి మీ స్టేటస్ వెరిఫికేషన్ కోసం క్యాప్చాను ఎంటర్ చేయండి.

Read Also : Amazon Prime Day Sale : అమెజాన్‌ ప్రైమ్ డే సేల్.. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి!

పీఎం కిసాన్ (PM Kisan) గురించి కాంటాక్ట్ పాయింట్‌ను ఎలా సెర్చ్ చేయాలి?  :
e-KYC ఫెయిల్, తప్పు బ్యాంక్ వివరాలు, ఆధార్ మ్యాచ్ కాకపోవడం లేదా మొబైల్ నంబర్ లోపాలు వంటి సమస్యల విషయంలో అర్హత కలిగిన లబ్ధిదారులు తమ వివరాలను ధృవీకరించుకుని సరైన కాంటాక్టు పాయింట్ (PoC)ని సంప్రదించాలి.

పీఎం కిసాన్ పథకం కింద కాంటాక్ట్ పాయింట్‌ ఎలా పొందాలంటే? :
1. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
2. కొంచెం స్క్రోల్ చేసి, ‘Search Your Point of Contact (POC)’పై క్లిక్ చేయండి.
3. ‘Search Distric Nodal’ ఎంచుకోండి.
4. మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి.
ఇప్పుడు, అధికారి పేరు, హోదా, మొబైల్ నంబర్, ఇమెయిల్-ఐడీ అడ్రస్ కనిపిస్తాయి. పీఎం కిసాన్ సంబంధిత ఏవైనా ప్రశ్నల కోసం వారిని సంప్రదించవచ్చు.

e-KYC ఎలా పూర్తి చేయాలి? :
పీఎం కిసాన్ 20వ వాయిదా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అర్హత కలిగిన రైతులు అంతకు ముందే పూర్తి చేయాలి. పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి. అది లేకుండా, మీ పేరు లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించవచ్చు. ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు eKYC తప్పనిసరి.

మీరు e-KYC ప్రక్రియ 3 మార్గాల్లో పూర్తి చేయవచ్చు PM Kisan :

OTP-ఆధారిత e-KYC :
మీ ఆధార్ మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంటే.. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి OTP ఉపయోగించి ధృవీకరించండి.

బయోమెట్రిక్ e-KYC : ఫింగర్ ఫ్రింట్ అథెంటికేషన్ కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయండి.

ఫేషియల్ అథెంటికేషన్ :
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగ రైతుల కోసం ఒక ప్రత్యేక సౌకర్యం ఇప్పుడు CSC సెంటర్ల వద్ద అందుబాటులో ఉంది. ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయొచ్చు.