PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. అతి త్వరలో 20వ విడత విడుదల.. లబ్ధిదారు జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే ఇలా చేయండి..!

PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే ఏం చేయాలంటే?

PM Kisan Yojana

PM Kisan Yojana : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) 20వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఒక్కొక్కరికి రూ. 2వేలు విడుదల చేస్తోంది. చివరి 19వ విడత ఫిబ్రవరి 2025లో వచ్చింది. ఇప్పుడు 20వ విడత జూలై 2025లో విడుదల చేస్తారని భావిస్తున్నారు.

లబ్ధిదారుల జాబితాలో పేరును ఎలా చెక్ చేయాలి? :

  • మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయాలంటే ఈ కింది విధంగా ప్రయత్నించండి.
  • అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
  • ‘Farmers Corner’కి వెళ్లి లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి.
  • మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను ఎంటర్ చేయండి.
  • ‘Get Report’ పై క్లిక్ చేసి, లబ్ధిదారుల జాబితాను చెక్ చేయండి.

మీ పేరు లేకపోతే ఏం చేయాలి? :
పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు లేకపోతే కంగారుపడొద్దు. పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం.. మీ జిల్లాలోని ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ కమిటీని సంప్రదించవచ్చు. ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో అవసరమైన సేవలు అందుబాటులో ఉన్నాయి.

కొత్త రైతు రిజిస్ట్రేషన్ (PM Kisan Yojana)  :

  • మీరు ఫస్ట్ టైం అప్లయ్ చేసుకుంటుంటే లేదా చివరిసారి దరఖాస్తు చేసుకోకపోతే కొత్త రైతు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోండి.
  • ఆధార్, భూమి వివరాలను ఎంటర్ చేయండి.
  • ఫారమ్ రాష్ట్ర నోడల్ అధికారికి వెళ్తుంది.
  • వెరిఫికేషన్ తర్వాత విడతలో పేరు చేర్చవచ్చు.

ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయండి :
మీ ఆధార్‌లో పేరు స్పెల్లింగ్ తేడాగా ఉంటే వాయిదా ఆగిపోవచ్చు. మీరు ఈ టూల్ సాయంతో పేరును ఎడిట్ చేయొచ్చు. ఈ ప్రక్రియ రియల్ టైమ్‌లో పూర్తి చేయొచ్చు.

Read Also : Passwords Leak : ఆన్‌లైన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. అర్జంట్‌గా మీ పాస్‌వర్డ్ మార్చండి.. లేదంటే డేటా హ్యాకర్ల చేతుల్లోకి..!

లబ్ధిదారు స్టేటస్ అప్‌డేట్ చేయండి :
మీరు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా మీ వాయిదా స్టేటస్ చెక్ చేయవచ్చు.

పీఎం కిసాన్ వాయిదా అందలేదా? ఎవరిని సంప్రదించాలి? :

  • మీరు e-KYC, రాంగ్ బ్యాంక్ వివరాలు, ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నంబర్ కారణంగా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. మీ జిల్లాలోని POC (పాయింట్ ఆఫ్ కాంటాక్ట్)ని సంప్రదించవచ్చు.
  • పీఎం కిసాన్ (https://pmkisan.gov.in)కి వెళ్లండి.
  • కిందికి స్క్రోల్ చేసి.. సెర్చ్ యువర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ (POC)పై క్లిక్ చేయండి.
  • జిల్లా నోడల్‌ ఆప్షన్ ఎంచుకోండి.
  • మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకోండి.
  • సంబంధిత అధికారి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ కనిపిస్తాయి. మీరు సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడవచ్చు.