×
Ad

PM Kisan Yojana : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇంకా పడలేదా? ఇలా చేస్తేనే మీకు రూ. 2వేలు పడతాయి..!

PM Kisan Yojana : పీఎం కిసాన్ 21వ విడత డబ్బులు ఇంకా జమ కాలేదా? డోంట్ వర్రీ.. ముందు ఇలా చేయండి.. రూ. 2వేలు అకౌంటులో వెంటనే పడతాయి.. పరిష్కారం ఇదిగో..

PM Kisan Yojana 21st Installment

PM Kisan Yojana 21st Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడత డబ్బులు కోసం ఎదురుచూశారు. ఎట్టేకలకు నిరీక్షణ ముగిసింది. పీఎం కిసాన్ 21వ విడత వాయిదా వచ్చేసింది. పీఎం నరేంద్ర మోదీ ఈ పథకం 21వ విడతను కోయంబత్తూరు నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. రూ. 2,000 వాయిదా DBT ద్వారా 9 కోట్లకు పైగా రైతులకు చేరుకుంది.

అయితే, ఎప్పటిలాగే, పెద్ద సంఖ్యలో రైతులకు (PM Kisan Yojana) వాయిదా డబ్బులు అందలేదు. ప్రతిసారి ఇలాంటి రైతులకు ఆందోళన సహజమే, కానీ దీనికి పరిష్కారం కూడా ఉంది. మీరు చేయాల్సిందిల్లా.. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం.. పీఎం కిసాన్ పథకం కోసం మీరు ఇచ్చిన సమాచారంలో ఏదైనా తప్పులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రూ. 2వేలు పడాలంటే తప్పనిసరిగా లబ్దిదారు రైతులు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం..

మీ వాయిదా అందకపోతే ముందుగా ఏం చెక్ చేయాలి? :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రయోజనాలను పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలను నిర్దేశించింది. చాలా మంది రైతులు ఇంకా తమ e-KYCని పూర్తి చేయలేదు. అందుకే వారికి అందాల్సిన వాయిదాలు నిలిచిపోతున్నాయి. అదనంగా, బ్యాంకు అకౌంటుతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ అసంపూర్ణంగా ఉంటే బ్యాంకు పేమెంట్ రిజెక్ట్ అవుతుంది. పీఎం కిసాన్ రైతులు ఎక్కువగా తమ ల్యాండ్ వెరిఫికేషన్ చేసి ఉండరు.

Read Also : Annadata Sukhibhava : ఏపీ రైతులకు బిగ్ అలర్ట్.. ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు పడకపోతే ఏం చేయాలి? ఫుల్ డిటెయిల్స్..!

అయినప్పటికీ లబ్ధిదారులు వ్యవసాయ భూమిని కలిగి ఉంటారు. ల్యాండ్ వెరిఫికేషన్ చేయడంలో ఫెయిల్ అయితే వాయిదా డబ్బులు నిలిచిపోతాయి. కొన్ని సందర్భాల్లో, ఫారమ్‌లోని తప్పుడు సమాచారం కారణంగా కూడా పేమెంట్లు ఆలస్యం అవుతాయి. కొన్నిసార్లు మీ సమాచారం సరైనదా కాదో చెక్ చేస్తారు. రైతులు ముందుగా పేమెంట్ ఆలస్యానికి అసలు కారణాన్ని గుర్తించాలి.

21వ వాయిదా రాకపోతే ఏం చేయాలి? :

రైతులు ముందుగా తమ సమాచారం అంతా సరైనదో కాదో చెక్ చేసుకోవాలి. అన్ని సరిగ్గా ఉన్నా వాయిదా ఇంకా బ్యాంకు అకౌంట్లో జమ కాకపోతే ఇన్‌స్టంట్ హెల్ప్ కోరవచ్చు. ఈ పథకం కోసం 155261, 011-24300606 వంటి హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి రైతులు తమ పేమెంట్ స్టేటస్ గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

రైతులు తమ ఫిర్యాదులను పీఎం కిసాన్ పోర్టల్‌లోని హెల్ప్‌డెస్క్ విభాగంలో రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసి కూడా రిపోర్టు చేయొచ్చు. తమ ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించాలనుకునే రైతులు (pmkisan-ict@gov.in)కు ఇమెయిల్ పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫిర్యాదులను విచారించి ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరిస్తుంది. తద్వారా ఆగిపోయిన రూ. 2వేలు త్వరలో విడుదల చేయవచ్చు.