PM Kisan Yojana : పీఎం కిసాన్ 22వ విడతపై ఉత్కంఠ.. రైతుల లబ్ధిదారు జాబితాలో మీ పేరు లేదా? మీ ఫోన్ నుంచే స్టేటస్ చెక్ చేయండి

PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ యోజన రైతులు తప్పనిసరిగా లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే 22వ విడత రూ. 2వేలు పొందలేరు..

PM Kisan Yojana 22nd Installment

  • పీఎం కిసాన్ 22వ విడత విడుదల ఎప్పుడంటే?
  • ఈ రైతులకు ఈసారి రూ. 2వేలు జమ కాకపోవచ్చు
  • రైతుల లబ్ధిదారు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేశారా?
  • లబ్ధిదారుల స్థితిని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి

PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో 22వ విడత రాబోతుంది. చాలామంది రైతులకు డబ్బులు అందకపోవచ్చు? ఎందుకంటే.. వారిలో ఎక్కువ మంది పేర్లు తొలగించి ఉండొచ్చు.

మీకు రూ. 2వేలు ఆర్థిక సాయం అందాలంటే తప్పనిసరిగా పీఎం కిసాన్ పథకానికి అర్హత ఉండాలి. ఇంతకీ మీ పేరు పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోండి. 22వ విడతకు ముందే ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి. లేదంటే రావాల్సిన రూ. 2వేలు మీ ఖాతాలో పడవు. లబ్ధిదారుల స్థితిని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండి.

పీఎం కిసాన్ యోజన కింద ఆర్థిక సాయం ఎంతంటే? :
ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయానికి ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన 2019లో ప్రారంభమైంది. మొదటిసారి బడ్జెట్‌లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

అప్పటినుంచి పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం అందుతోంది. ఒక్కొక్కటి రూ. 2వేలు చొప్పున 3 విడతలుగా పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు, పీఎం కిసాన్ 21 విడతలు విడుదలయ్యాయి. 22వ విడత ఇంకా రావాల్సి ఉంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
మీ పేరు పీఎం కిసాన్ జాబితాలో ఉందో లేదో తెలుసుకునేందుకు మీ పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ చెక్ చేయాలి. ఇందుకోసం మీ ఫోన్ నుంచి అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.in/కు వెళ్లండి. ఇప్పుడు “Know Your Status” ఆప్షన్ క్లిక్ చేయండి. గతంలో, ‘Beneficiary Status’ కానీ ఇప్పుడు ‘Know Your Status’ అని కనిపిస్తుంది.

రిజిస్ట్రేషన్ నంబర్ ఎలా? :
‘Know Your Status’పై క్లిక్ చేశాక మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయండి. పీఎం కిసాన్ యోజన కింద రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపుతారు. ఓటీపీని సమర్పించండి. అప్పుడు మీ పేరు పీఎం కిసాన్ జాబితాలో ఉందా లేదా తొలగించారా? అని తెలుసుకోవచ్చు.

మీ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే ఏం చేయాలి? :
చాలా మంది రైతులు తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ మర్చిపోతారు. కానీ, ఆందోళన అవసరం లేదు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి ‘Know Your Status”పై క్లిక్ చేయండి. మీకు “Know Your Registration Number” ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ కోసం మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

Read Also : 8th Pay Commission : పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. వారికి సవరించిన పెన్షన్లు ఇస్తారా? కేంద్రం క్లారిటీ!

బీహార్ రైతులకు రూ. 9వేలు :
బీహార్ రైతులకు పీఎం కిసాన్ మొత్తం మారింది. బీహార్ రైతులు ఇప్పుడు సంవత్సరానికి రూ. 6వేలకు బదులుగా రూ.9,000 అందుకుంటారు. గతంలో రూ. 2వేలు ఉన్న ప్రతి విడత ఇప్పుడు రూ. 3,000 అందుకుంటుంది. పీఎం కిసాన్ 22వ విడతతో ప్రారంభమవుతుంది.

19 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు :

పీఎం కిసాన్ యోజన 22వ విడత రాకముందు మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. యూపీ ప్రభుత్వం ఇటీవలే దాదాపు 1.9 మిలియన్ల మంది రైతులను బ్లాక్ లిస్ట్ చేసింది. వీరిలో చాలామంది పీఎం కిసాన్ యోజనను మోసపూరితంగా వినియోగించినట్టు తేలింది.

పీఎం కిసాన్ 22వ విడత ఎప్పుడంటే? :
పీఎం కిసాన్ 22వ విడతకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ, పీఎం కిసాన్ విడత ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది. పీఎం కిసాన్ 21వ విడత గత ఏడాది నవంబర్‌లో విడుదలైంది. ఇప్పుడు పీఎం కిసాన్ 22వ విడత హోలీకి ముందు విడుదల అవుతుందని అంచనా.

పీఎం కిసాన్‌పై మోదీ కీలక ప్రకటన :
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పీఎం కిసాన్ యోజనపై పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. “చిన్న రైతుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. అందుకే మేం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చాం. ఇంత తక్కువ సమయంలో, ప్రభుత్వం చిన్న రైతుల ఖాతాల్లో సుమారు రూ. 4 లక్షల కోట్ల రూపాయలను జమ చేసింది” అని అన్నారు.