8th Pay Commission : పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్.. వారికి సవరించిన పెన్షన్లు ఇస్తారా? కేంద్రం క్లారిటీ!
8th Pay Commission: డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు 8వ వేతన సంఘం కింద సవరించిన పెన్షన్ లభిస్తుందా? ఆర్థిక బిల్లు 2025 కారణంగా పెన్షనర్ల నియమాలు మారుతాయా? లేదో కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
8th Pay Commission
- 8వ వేతన సంఘం కింద సవరించిన పెన్షన్ లభిస్తుందా?
- రిటైర్ అయిన ఉద్యోగులు సవరించిన పెన్షన్‌కు అర్హులా కాదా?
- ప్రస్తుత పెన్షన్ నియమాలు ఆర్థిక చట్టం 2025తో మారుతాయా?
- పెన్షన్ సవరణకు సంబంధించి అనేక ప్రశ్నలపై కేంద్రం స్పష్టత
8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు బిగ్ గుడ్ న్యూస్.. పెన్షన్ సవరణకు సంబంధించి అనేక ప్రశ్నలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. 8వ కేంద్ర వేతన సంఘం(CPC), డిసెంబర్ 31, 2025న లేదా అంతకుముందు రిటైర్ అయిన పెన్షనర్లకు సవరించిన పెన్షన్లు లభిస్తాయా లేదా అనేదానిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది.
ఫిబ్రవరి 9న రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ ఎంపీ ఆనంద్ భడోరియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 8వ వేతన సంఘం స్థితిపై ప్రభుత్వ వైఖరిని ఆయన వివరించారు.
డిసెంబర్ 31, 2025న లేదా అంతకు ముందు రిటైర్ అయిన ఉద్యోగులు 8వ వేతన సంఘం కింద సవరించిన పెన్షన్లను అర్హులా కాదా? ఆర్థిక బిల్లు 2025 పదవీ విరమణ తేదీ ఆధారంగా పెన్షనర్ల మధ్య తేడాను గుర్తిస్తుందా? లేదా అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.
పెన్షన్‌దారుల్లో ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పై ప్రభుత్వ స్పందన తెలియజేశారు. పెన్షన్లను నేరుగా ఆర్థిక బిల్లు ద్వారా నిర్ణయించడం, సవరించడం జరగదని స్పష్టం చేశారు.
ఆర్థిక చట్టం 2025 ప్రస్తుత పెన్షన్ నియమాల్లో మార్పు? :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు అనేవి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నియమాలు 2021, అసాధారణ పెన్షన్ నియమాలు, 2023 కాలానుగుణంగా జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగానే అమలు అవుతాయని తెలిపారు. వేతన సంఘం సిఫార్సులను చేసినప్పుడు ప్రభుత్వం వాటిని ఆమోదించినప్పుడల్లా ప్రత్యేక ఉత్తర్వులు జారీ అవుతాయి. అంటే.. కేవలం ఆర్థిక బిల్లు 2025 ఆధారంగా పెన్షన్ల సవరణ జరగదని తేల్చిచెప్పారు.
పెన్షనర్లకు సవరించిన పెన్షన్లు లభిస్తాయా? :
ఆర్థిక చట్టం, 2025లోని పార్ట్ IV ప్రస్తుత పెన్షన్ నియమాలు మాత్రమే వర్తిస్తాయని వాటిని మార్చే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పౌర, రక్షణ పెన్షన్లలో ప్రత్యక్ష మార్పులు ఉండవు. వాస్తవానికి, కేంద్ర వేతన సంఘం అనేది వివిధ వర్గాల ఉద్యోగులకు జీతాలు, భత్యాలు, పెన్షన్లను సిఫార్సు చేసే నిపుణుల సంస్థ. కానీ, ప్రభుత్వం నిబంధనల ద్వారా వాటి అమలుపై నిర్ణయం తీసుకుంటుంది.
8వ వేతన సంఘంపై కీలక అప్డేట్ :
8వ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటుపై కూడా కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అందించింది. నవంబర్ 3, 2025న ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు, నిబంధనలు (ToR)ను నోటిఫై చేసిందని మంత్రి పేర్కొన్నారు. కమిషన్ ఏర్పడిన 18 నెలల్లోపు పూర్తి నివేదికను సమర్పించాలి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనం, భత్యాలు, పెన్షన్లకు సంబంధించిన అన్ని అంశాలపై కమిషన్ సిఫార్సులు చేస్తుంది. ప్రస్తుతం, కమిషన్ సిఫార్సులు అందిన తర్వాత ప్రభుత్వం వాటిని ఆమోదించాక మాత్రమే ఏవైనా పెన్షన్ సవరణలు చేసే అవకాశం ఉంది.
