PM Kisan Yojana
PM Kisan Yojana 22nd Installment : పీఎం కిసాన్ కొత్త రైతులకు బిగ్ అలర్ట్.. ఇప్పటివరకూ ఒక్క విడత కూడా అందుకోలేదా? కొత్తగా పీఎం కిసాన్ రూ. 2వేలు కోసం అప్లయ్ చేశారా? అయితే, మీరు రాబోయే 22వ విడత అందుకోవాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి. మీరు అర్హులైతేనే పీఎం కిసాన్ విడత డబ్బులు అందుతాయి.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద లబ్దిపోందే రైతులకు ప్రతి ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. అయితే, ఈ పథకాన్ని ఇంకా సద్వినియోగం చేసుకోని రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పటివరకు, ఈ పథకం 21 వాయిదాలు విడుదలయ్యాయి. ప్రతి విడత లబ్ధిదారుని ఖాతాకు రూ. 2వేలు జమ అయ్యాయి. ఇప్పుడు, రైతులు 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
22వ విడత కోసం ఎదురు చూస్తున్నా రైతుల్లో చాలా మందికి ఇంకా ఒక్క విడత కూడా అందలేదు. 22వ విడత అందుతుందో లేదో అని ఆలోచిస్తున్నారు. ఇంతకీ కొత్తగా అప్లయ్ చేసుకున్న రైతులకు పాత వాయిదా డబ్బులు రావు. కానీ, రాబోయే వాయిదా డబ్బులను అందుకునే అవకాశం ఉంది. అది ఎలాగా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ రైతులకు 22వ విడత అందుతుందా? :
మీరు కొత్త రైతు అయితే.. పీఎం కిసాన్ యోజనలో ఒక్క వాయిదా కూడా అందుకోకపోతే మీరు ఇప్పటికీ 22వ విడత పొందవచ్చు. మీరు అప్లయ్ చేసుకుంటే చాలు. ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి ప్రయోజనం పొందాలంటే మీరు రైతు అయి ఉండాలి. మీకు వ్యవసాయ భూమి ఉంటే.. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తు ఆమోదం పొంది వెరిఫికేషన్ పూర్తి అయితే మీరు పీఎం కిసాన్ వాయిదాలను పొందవచ్చు.
పీఎం కిసాన్ యోజన 22వ విడత ఇంకా రాలేదు. మీరు ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటే.. మీకు 22వ విడత అందే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజనకు మీరు ఎలా అప్లయ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పీఎం కిసాన్ యోజన ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? :
అర్హత కలిగిన రైతులు రెవెన్యూ అధికారులు, గ్రామ పట్వారీలు లేదా ఇతర నియమిత ఏజెన్సీల సాయంతో అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. తద్వారా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ పోర్టల్‌లో సెల్ఫ్ రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు లేదా రిజిస్టర్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని విజిట్ చేయొచ్చు.
రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు :
మీరు రిజిస్టర్ కోసం ఈ కింది విధంగా ఫాలో అవ్వండి :