PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది ఎప్పుడో తెలిసిందోచ్.. ఇప్పుడే ఈ పనులు పూర్తి చేయండి!

PM Kisan Yojana : పీఎం కిసాన్ డబ్బులు బ్యాంకు అకౌంటులో పడాలంటే ఇంతకీ రైతులు ఏయే పనులు చేయాలంటే?

PM Kisan Yojana

PM Kisan Yojana : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులు ఇప్పుడు 20వ విడత అందుకోనున్నారు. ఈ విడత రూ. 2వేల కోసం రైతులంతా (PM Kisan Yojana) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఫిబ్రవరిలో 19వ విడత డబ్బులు పడగా.. ఇప్పుడు 20వ విడత డబ్బులు పడాల్సి ఉంది.

అంచనాల ప్రకారం.. జూన్ చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. దాదాపు 10 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకంలో మీ పేరు ఉంటే.. ముందుగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయండి.

Read Also : iPhone 16 Plus : కొత్త ఐఫోన్ కావాలా? ఈ ఐఫోన్ 16 ప్లస్‌ చాలా చీప్ గురూ.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే..!

అప్పుడు డబ్బులు జమ కావడంపై ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మీకు రావాల్సిన రూ. 2వేలు నిలిచిపోతాయి. పీఎం కిసాన్ డబ్బులు బ్యాంకు అకౌంటులో పడాలంటే ఇంతకీ రైతులు ఏయే పనులు చేయాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అర్హతలివే :
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Yojana) బెనిఫిట్స్ పొందాలంటే లబ్ధిదారులు రైతులు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. రికార్డులో ల్యాండ్ రిజిస్టర్ చేయాలి. అదనంగా, రైతులు తమ బ్యాంకు అకౌంట్ లింక్ చేసి ఉండాలి. కేవైసీని ఎంత త్వరగా పూర్తి చేసే అంత మంచిది.

వెంటనే e-KYC చేయించుకోండి :
పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే లబ్ధిదారు రైతులు తప్పనిసరిగా నో యువర్ కస్టమర్ (KYC) పూర్తి చేయాలి. లేదంటే వారికి రావాల్సిన డబ్బులు ఆగిపోతాయి. ముందుగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి.

రైతులు (pmkisan.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా e-KYC ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డుకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని వెరిఫై చేయడం ద్వారా రైతులు ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు.

Read Also : Motorola Edge 50 : మోటోరోలా ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. భారీ డిస్కౌంట్ మీకోసమే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు..!

ఎలా చెక్ చేయాలి? :
పీఎం కిసాన్ యోజన 20 విడత డబ్బులను సులభంగా చెక్ చేయవచ్చు. ఇందుకోసం అధికారిక సైట్‌ (pmkisan.gov.in)ను విజిట్ చేయాలి.