Motorola Edge 50 : మోటోరోలా ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. భారీ డిస్కౌంట్ మీకోసమే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు..!

Motorola Edge 50 : మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ కొనుగోలుపై రూ. 15,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. కొనుగోలుదారులు ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Motorola Edge 50 : మోటోరోలా ఫోన్ కొంటే ఇప్పుడే కొనేసుకోండి.. భారీ డిస్కౌంట్ మీకోసమే.. ఇంత తక్కువలో మళ్లీ దొరకదు..!

Motorola Edge 50

Updated On : June 8, 2025 / 11:24 AM IST

Motorola Edge 50 : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మీరు మోటోరోలా లవర్స్ అయితే ఈ ఆఫర్ మీకోసమే.. మిడ్‌రేంజ్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో కొత్త ఫోన్ డిస్కౌంట్ ధరకే (Motorola Edge 50) కొనేసుకోవచ్చు. మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ ఈ నెల 10న లాంచ్ కానుంది. అంతకంటే ముందే మోటోరోలా ఎడ్జ్ 50 ధర భారీగా తగ్గింది.

ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఈ ఫోన్ వెరీ స్పెషల్. ఆకర్షణీయమైన ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉంది. బిగ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, ప్రాసెసర్, అత్యుత్తమ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Oppo K13x : రూ. 15వేల లోపు ధరలో ఒప్పో K13x ఫోన్ వచ్చేస్తోంది.. రీబ్రాండెడ్ వెర్షన్ కెమెరా, బ్యాటరీ వివరాలివే..!

మోటోరోలా ఎడ్జ్ 50 డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ మరో అద్భుతమైన ఆఫర్ (Motorola Edge 50) తీసుకొచ్చింది. మోటోరోలా ఎడ్జ్ 50పై ధరపై డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 27,999 ఉండగా, ఇప్పుడు చాలా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఫ్లాట్ 33 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 50 కేవలం రూ. 21,999కు కొనుగోలు చేయవచ్చు. అదనంగా, మోటోరోలా ఎడ్జ్ 50 కొనుగోలు చేసే కస్టమర్లకు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే.. కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. తక్కువ బడ్జెట్‌లో ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది.

తద్వారా వినియోగదారులు పాత ఫోన్ల కొనుగోలుపై రూ.21,450 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ వాల్యూ రూ.6వేలు అయితే, కొత్త స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.15,500కే సొంతం చేయవచ్చు. ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also : iPhone 16 Plus : కొత్త ఐఫోన్ కావాలా? ఈ ఐఫోన్ 16 ప్లస్‌ చాలా చీప్ గురూ.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే..!

మోటోరోలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫోన్ IP68 రేటింగ్‌తో (Motorola Edge 50) సిలికాన్ పాలిమర్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల P-OLED డిస్‌ప్లేను అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 AE ప్రాసెసర్‌తో మోటోరోలా ఎడ్జ్ 50 అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది.