దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి. అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది కేంద్ర సర్కారు విడతలవారీగా రూ.6 వేల చొప్పున జమచేస్తోంది.
పీఎం-కిసాన్ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది కేంద్ర సర్కారు రూ.6 వేలు అందిస్తుంది. ఈ పథకంలో భాగంగా 25 శాతం ప్రయోజనాలను మహిళా రైతులకు కేటాయిస్తుంది.
Also Read: బిహార్ ఎన్నికల్లో అత్యంత పిన్న వయసు ఎమ్మెల్యేగా ఎన్నికైన అమ్మాయి.. ఈమెకి కోట్లాది మంది ఫాలోవర్లు
వ్యవసాయ శాఖ డిజిటల్ చెల్లింపుల్లో చేసిన మార్పులు ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ (ఆధార్ ఆధారిత గుర్తింపు ధ్రువీకరణ- వన్‌టైమ్ పాస్‌వర్డ్, బయోమెట్రిక్, ముఖ గుర్తింపు ద్వారా పూర్తి చేసే ప్రక్రియ) ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరిగింది.
పీఎం-కిసాన్ మొబైల్ యాప్ (రైతులు సేవలు పొందే అధికారిక యాప్), నూతన పోర్టల్ ఫీచర్లు ‘నో యువర్ స్టేటస్’ (దరఖాస్తు స్థితిని చూపించే విభాగం), ఇంటి వద్ద నుంచే ఆధార్ లింక్, బ్యాంకింగ్ సేవలురైతులకు మరింత అనుకూలంగా మారాయి.
ఏఐ బేస్డ్ కిసాన్-ఈమిత్రా చాట్‌బాట్ (రైతులకు 24/7 సహాయ, సేవలు అందించే ఏఐ) 11 ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తోంది. దరఖాస్తు స్థితి, చెల్లింపు వివరాలు తెలుసుకునే అవకాశం ఇస్తోంది, సందేహాలు తీర్చుతోంది. ప్రభుత్వం రైతు రిజిస్ట్రీని (రైతుల వివరాలు ఒకే వేదికలో నమోదు చేసే వ్యవస్థ) ప్రారంభించింది.