PM Suraksha Bima Yojana
PM Suraksha Bima Yojana : మీరు ప్రమాద బీమా తీసుకున్నారా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. అది కూడా తక్కువ ప్రీమియంతో ఇప్పుడు యాక్సిడెంటల్ ప్రీమియం పాలసీని తీసుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ఎప్పుడు? ఎవరికి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందో చెప్పలేం.
ఇలాంటి పరిస్థితులలో మీ దగ్గర (PM Suraksha Bima Yojana) ప్రమాద బీమా ఉంటే ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే, చాలా ప్రమాద బీమా పాలసీలు మార్కెట్లో ఎక్కువ ప్రీమియంతో అందిస్తున్నాయి. ఈ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడం సామాన్యులకు కష్టమే.
అందుకే, ఇలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. సాధారణ ప్రజలకు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పేరుతో సరసమైన ప్రమాద బీమా పథకాన్ని అందిస్తుంది. ఈ పథకానికి ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది.
అందుకే చిన్న పిల్లవాడు కూడా ఈజీగా చెల్లించగలరు. అంటే.. ఏడాదికి కేవలం రూ. 20కి లేదా నెలకు రూ. 2 కన్నా తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం కష్ట సమయాల్లో కుటుంబానికి ఊరటనిస్తుంది. రూ.2 లక్షల వరకు సాయం అందిస్తుంది.
పీఎం సురక్ష బీమా యోజన ఏంటి? :
PMSBY స్కీమ్ అనేది అతి తక్కువ ప్రీమియంతో ప్రభుత్వం అందించే ప్రమాద బీమా పాలసీ. ఈ పథకానికి ప్రీమియం మొదట్లో రూ. 12గా ఉండేది. కానీ, జూన్ 2022 నుంచి రూ. 20కి పెంచారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు ఆర్థిక సాయం పొందవచ్చు.
ఈ పథకం బెనిఫిట్స్ ఎవరు పొందవచ్చు? :
18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకాన్ని పొందవచ్చు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ప్రీమియం ఆటో-డెబిట్ కోసం సమ్మతి అవసరం. అకౌంట్ క్లోజ్ అయితే పథకం కూడా ఆటోమాటిక్‌గా ముగుస్తుంది.
బీమా క్లెయిమ్ ఎప్పుడంటే? :
స్కీమ్ నిబంధనల ప్రకారం.. నామినీకి లేదా బీమా చేసిన వ్యక్తికి క్లెయిమ్ అందుతుంది.
రెన్యువల్ ఎలా చేయాలంటే? :
రూ. 20 ప్రీమియం ఒక ఏడాది పాటు చెల్లుతుంది. ఈ ప్రీమియం ప్రతి ఏడాదిలో జూన్ 1వ తేదీ నాటికి మీ అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా డెబిట్ అవుతుంది. గడువు తేదీలోగా రెన్యువల్ చేయకపోతే మీ బీమా యోజన పథకం నిలిచిపోతుంది.
PMSBY ప్రీమియం ఎలా చెల్లించాలి?
ఈ ప్రీమియం ప్రతి ఏడాదిలో మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటోమాటిక్‌గా కట్ అవుతుంది.
బ్యాంక్ అకౌంట్ లేకుండా PMSBY పొందవచ్చా?
లేదు. యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి.
70 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఈ పథకం కొనసాగుతుందా?
లేదు.. 70 ఏళ్లు పూర్తయిన తర్వాత పథకం ముగుస్తుంది.
నేను క్లెయిమ్ ఎలా పొందగలను?
ప్రమాద పత్రాలు, మరణ ధృవీకరణ పత్రం లేదా వైకల్య ధృవీకరణ పత్రంతో బ్యాంకు, బీమా కంపెనీలో క్లెయిమ్ ప్రాసెస్ అవుతుంది.