Vodafone to Jio Port : ఇండియాకు 5G వస్తోంది.. వోడాఫోన్ నుంచి జియోకు ఈజీగా మారిపోవచ్చు .. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

How to Port Vi to Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాల్లో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) రెండూ టెల్కోలు తమ 5G సర్వీసులను అక్టోబర్ నాటికి భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశాయి.

Port Vodafone to Jio : How to port Vodafone prepaid or postpaid number to Reliance Jio

How to Port Vi to Jio : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాల్లో రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్ (Airtel) రెండూ టెల్కోలు తమ 5G సర్వీసులను అక్టోబర్ నాటికి భారత మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశాయి. మరోవైపు దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా Vodafone Idea (Vi) తమ 5G సర్వీసులను ఎప్పుడు ప్రారంభించే విషయం వెల్లడించలేదు. అధికారిక లాంచ్ ముందే 5G సర్వీసులను ఎలా వినియోగంలోకి తీసుకురావాలి అనేది ప్రస్తుత కస్టమర్ల నుంచి డిమాండ్, సామర్థ్య అవసరాలు, పోటీ డైనమిక్స్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని Vi MD రవీందర్ టక్కర్ చెప్పారంటూ ఓ కొత్త నివేదిక పేర్కొంది.

ఎయిర్‌టెల్ (Airte 5G), జియో (Reliance Jio 5G) మాదిరిగానే సర్వీసులను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే, 5G సర్వీసులను పొందాలంటే మీరు Vi నెట్‌వర్క్‌లో ఉంటే సాధ్యపడదు. అందుకే మీరు త్వరగా మీ Vi ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ నంబర్‌ను పోర్ట్ (How to Port SIM Number) చేసుకోవచ్చు. మీరు పోస్టు పెయిడ్ యూజర్లు (Postpaid Number) అయినా లేదా ప్రీపెయిడ్ నెంబర్ (Prepaid Number) యూజర్లు అయినా సులభంగా మీకు నచ్చిన మొబైల్ నెట్ వర్క్‌లోకి పోర్టబుల్ కావొచ్చు. మీ ఫోన్ నెంబర్ మాత్రం మారదు.. కానీ, మీ నెట్‌వర్క్ మాత్రమే మారుతుంది.

Port Vodafone to Jio : How to port Vodafone prepaid or postpaid number to Reliance Jio

ఇప్పటికే ఉన్న 4G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై అభివృద్ధి చేసిన NSA 5Gకి బదులుగా భారత్‌లో రియల్ ఇండిపెండెంట్ 5G నెట్‌వర్క్‌ను అందిస్తామని ఒక్క జియో మాత్రమే స్పష్టం చేసింది. భారత్‌లో టెల్కో ఇండస్ట్రీలో విప్లవాత్మకమైన 4G లాంచ్ సమయంలోనూ మిగతా టెల్కోల కన్నా ముందే ప్రారంభించి Jio సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే దృష్టిలో ఉంచుకుని.. రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్ మరింత సరసమైన ధరకే అందించనుందని తెలిపింది.

5G సర్వీసులు ప్రారంభంలో ప్లాన్ల ధరలు ఖరీదైనవిగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితంగా 5G సర్వీసులను అందించనున్నట్టు జియో హామీ ఇచ్చింది. అందుకే 5G సర్వీసులు కోరుకునే వినియోగదారులు Vi నెట్‌వర్క్ నుంచి వెంటనే మరో నెట్‌వర్క్‌కు పోర్టబుల్ (Port) కావొచ్చు. ప్రస్తుత వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ నుంచి Reliance Jio లేదా Airtel 5G నెట్‌వర్క్‌కు పోర్టబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకీ Vi నెట్‌వర్క్ నుంచి Jio నెట్‌వర్క్‌కు లా పోర్ట్ కావాలో ప్రాసెస్ చూద్దాం..

మీ Vi నంబర్‌ని Jioకి ఎలా పోర్ట్ చేయవచ్చో తెలుసా? :

* Vi నుంచి Jioకి పోర్ట్ చేయాలంటే.. మీ ప్రస్తుత నంబర్ నుంచి 1900కి PORT అని SMS చేయండి.
* మీరు UPC కోడ్, గడువు తేదీని SMSతో పొందివచ్చు.
* UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్)తో సమీప Jio Store లేదా జియో రిటైలర్‌ (Jio Retailer)లోకి వెళ్లండి.
* పోర్ట్ రిక్వెస్ట్ కోసం మీ ఆధార్ కార్డ్ లేదా అడ్రస్ ప్రూఫ్ (POA) / ఐడెంటిటీ ప్రూఫ్ (POI) డాక్యుమెంట్లు తీసుకెళ్లండి.
* మీరు Vi పోస్టు పెయిడ్ అయితే బిల్లులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి.
* ఆ తర్వాత మీ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది.
* మీరు Vi నుంచి Jio పూర్తిగా పోర్టబుల్ కావడానికి కనీసం 3 రోజుల వరకు పట్టవచ్చు.
* Jio రిటైలర్ ప్రకారం.. మీరు రూ. 300 కన్నా ఎక్కువ విలువైన ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
* ఇది ఫ్రీ (Free) కాదని గుర్తించుకోండి.
* జమ్మూ & కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల నుంచి పోర్ట్-ఇన్ (Port-in) రిక్వెస్ట్ పొందాలంటే 15 వర్కింగ్ డేస్‌లో పూర్తవుతుంది.
* ఒకవేళ మీరు Vi to Airtelకి పోర్ట్ చేయాలనుకుంటే.. ఇదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Reliance Jio 5G Services : అంబానీ మాటంటే మాటే.. దీపావళికి భారత్‌కు జియో 5G సేవలు.. ఆ 4 నగరాల్లోనే ఫస్ట్.. ఫుల్ లిస్టు ఇదిగో..!

ట్రెండింగ్ వార్తలు