Reliance Jio 5G Services : అంబానీ మాటంటే మాటే.. దీపావళికి భారత్‌కు జియో 5G సేవలు.. ఆ 4 నగరాల్లోనే ఫస్ట్.. ఫుల్ లిస్టు ఇదిగో..!

Reliance Jio 5G Services : దేశమంతా 5G సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండియాలో 5G నెట్‌వర్క్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.

Reliance Jio 5G Services : అంబానీ మాటంటే మాటే.. దీపావళికి భారత్‌కు జియో 5G సేవలు.. ఆ 4 నగరాల్లోనే ఫస్ట్.. ఫుల్ లిస్టు ఇదిగో..!

Jio 5G rollout will happen in 4 cities by Diwali: Check the full list and when your city will get 5G

Reliance Jio 5G Services : దేశమంతా 5G సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండియాలో 5G నెట్‌వర్క్ ఎంట్రీకి సమయం ఆసన్నమైంది. దేశీయ టెలికం దిగ్గజం, డేటా సంచలనం రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కంపెనీ అధినేత, RIL ఛైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) వచ్చే దీపావళిలోగా జియో 5G సర్వీసులు (Jio 5G Services in India) అందుబాటుకి వస్తాయని ప్రకటించారు. ఆగస్టు 29న రిలయన్స్ జియో వార్షిక సాధారణ సమావేశం (AGM) 2022 కార్యక్రమంలో ఎట్టకేలకు Jio 5G సేవలను ప్రకటించింది.

ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ.. ‘జియో డిజిటల్ కనెక్టివిటీలో.. ముఖ్యంగా ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌లో వేగవంతమైన సర్వీసులను ప్రకటించాలనుకుంటున్నాను… అదే Jio 5G సర్వీసులు. 5G సేవలను 100 మిలియన్ల గృహాలను అసమానమైన డిజిటల్ ఎక్స్ పీరియన్స్, స్మార్ట్ హోమ్ సొల్యూషన్‌లతో ఇంటిగ్రేట్ చేయనున్నాము’ అని పేర్కొన్నారు. Jio 5G సేవల ప్రకటనపై ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. భారత్‌లో 5G అందుబాటులోకి వస్తే.. ప్రస్తుత 800 మిలియన్ల కనెక్ట్ ఇంటర్నెట్ డివైజ్‌లు కేవలం ఒక ఏడాదిలోనే1.5 బిలియన్ కనెక్టెడ్ ఇంటర్నెట్ డివైజ్‌లకు రెట్టింపు అవుతాయని అన్నారు. అంతేకాదు.. సరసమైన ధరలో 5G ఫోన్‌ (Jio 5G Phone)ను భారత్‌కు తీసుకురావడానికి గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నట్లు జియో ప్రకటించింది. వచ్చే ఏడాది AGM సమావేశంలో జియో ఫోన్ 5G లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Jio 5G rollout will happen in 4 cities by Diwali Check the full list and when your city will get 5G

Jio 5G rollout will happen in 4 cities by Diwali Check the full list

Jio 5G Services లాంచ్ అయ్యే నగరాలు ఇవే :
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఎట్టకేలకు Jio 5G కనెక్టివిటీని దీపావళి నాటికి భారత్‌లో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. అంటే.. అక్టోబర్ 22 నుంచి జియో 5G సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు (ఆగస్టు 29న) జరిగిన 45వ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) కంపెనీ ప్రకటించింది. 5G కనెక్టివిటీని అందించే ముఖ్య నగరాలలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. గురుగ్రామ్, బెంగళూరు, చండీగఢ్, జామ్‌నగర్, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్ వంటి ఇతర నగరాల్లో కూడా కంపెనీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ముందుగా సూచించినట్లు భావిస్తున్నారు. డిసెంబర్ 2023 నాటికి అన్ని భారతీయ పట్టణాలు, ఇతర నగరాల్లో Jio 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయని జియో తెలిపింది.

Jio రియల్ 5G నెట్‌వర్క్‌ను అందించనుందని, నాన్-స్టాండలోన్ (NSA) 5G ఆప్షన్లకు బదులుగా స్టాండ్-ఏలోన్ (SA) 5G నెట్‌వర్క్‌లో నిర్మించనున్నట్టు RIL చైర్‌పర్సన్ చెప్పారు. NSA 5G అనేది 4G నెట్‌వర్క్.. SA నెట్‌వర్క్‌లు నెట్‌వర్క్ పనితీరును నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్‌లను సెంట్రలైజ్ కంట్రోలింగ్ వంటి ముఖ్యమైన 5G ఫంక్షన్‌లను నిర్వహించగలవని తెలిపారు. జియో 5G ప్లాన్‌లతో ప్రభుత్వ డిజిటల్ ఇండియా మిషన్‌ (Digital India Mission)లో విప్లవాత్మక మార్పులు చేస్తాయని కంపెనీ భావిస్తోంది. రిలయన్స్ కూడా కొన్ని ఏళ్లలో 2G-Mukt (2G-free) భారతదేశంగా అవతరించనుందని పేర్కొంది.

Jio 5G rollout will happen in 4 cities by Diwali Check the full list and when your city will get 5G

Jio 5G rollout will happen in 4 cities by Diwali Check the full list

అలాగే, గూగుల్‌తో కలిసి 5G నెట్‌వర్క్‌లను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ఇదివరకే వెల్లడించింది. ఇప్పటికే జియోకు దేశంలోవైర్డు బ్రాడ్‌బ్యాండ్‌కు 421 మొబైల్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వైర్డు బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్ కూడా. అయితే, వైర్డు కనెక్షన్ల విషయంలో భారత్ ఇతర దేశాల కంటే చాలా వెనుకబడి ఉందని కంపెనీ అభిప్రాయపడింది. జియో తన నెట్‌వర్క్‌తో ఆ పరిస్థితిని మార్చి ఇతర దేశాల కన్నా ధీటుగా మందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.

దీపావళి నాటికి 4 నగరాల్లో 5G సేవలు (Jio 5G Services) :
జియో 5G సర్వీసులను ప్రారంభించేందుకు ఇంకా సమయం ఉంది. దీపావళి నాటికి ఎంపిక చేసిన యూజర్లకు (Jio 5G Services) అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. వచ్చే రెండు నెలల్లో దీపావళి నాటికి 4 నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వస్తాయని అంబానీ ప్రకటించారు. ఇంతకీ ఆ నగరాలు ఏంటంటే.. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ముందుగా జియో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 2023 నాటికి జియో 5G సేవలు దేశంలోని ప్రతి మూలకు అన్ని పట్టణాలు, తాలూకాలు, ఇతర చిన్న పట్టణాలకు చేరుకుంటాయని RIL చైర్మన్ స్పష్టం చేశారు. జియో ‘Jio True 5G’ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ కూడా పెరుగుతుందని చెప్పారు. అంతేకాదు.. Jio 5G ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్ అవతరించనుందని అంబానీ ఆకాంక్షించారు.

Jio 5G rollout will happen in 4 cities by Diwali Check the full list and when your city will get 5G

Jio 5G rollout will happen in 4 cities by Diwali Check the full list

Jio 4G నెట్‌వర్క్‌పై Zero డిపెండెన్సీని కలిగిన స్టాండ్-అలోన్ 5G లేటెస్ట్ వెర్షన్‌ను అందించనుందని RIL చైర్మన్ వెల్లడించారు. పాన్-ఇండియా 5G నెట్‌వర్క్ అందించేందుకు.. Jio రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుందని అంబానీ ప్రకటించారు. ‘Quantum Security వంటి అధునాతన ఫీచర్‌లకు సపోర్టు చేసేలా cloud-native, software-defined, digitally managed ఎండ్-టు-ఎండ్ 5G స్టాక్‌ను దేశీయంగా అభివృద్ధి చేసినట్టు తెలిపారు. 2,000+ యువ జియో ఇంజనీర్లచే అంతర్గతంగా ఈ స్టాక్ డెవలప్ చేశామని అంబానీ వెల్లడించారు.

Read Also : Airtel 5G Services In India : తగ్గేదేలే.. జియోకు పోటీగా అక్టోబర్ నుంచి ఎయిర్‌టెల్ 5G సేవలు.. సునీల్ మిట్టల్ క్లారిటీ..!