Post Office Scheme : పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. మీ భార్యతో ఇలా పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 9,250 గ్యారంటీ.. ఎలాగంటే?

Post Office Scheme : మీరు కనీసం రూ. 1000 పెట్టుబడితో ఎంఐఎస్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం కింద మీరు వ్యక్తిగతంగా లేదా జాయింట్ అకౌంట్ రెండింటినీ ఓపెన్ చేయొచ్చు.. ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎంతకాలం ఎంత వడ్డీ వస్తుందంటే?

Post Office Scheme ( Image Credit to Original Source )

  • స్మార్ట్ కపుల్స్ కోసం సూపర్ ప్లాన్.. ప్రతి నెల రూ. 9,250 వడ్డీ సొంతం
  • పోస్టాఫీసులో భార్య పేరుతో పెట్టండి.. నెలకు ఎంత ఆదాయం వస్తుందంటే?
  • జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు.. వచ్చే 5 ఏళ్ల పాటు మీకు భారీ వడ్డీ

Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేవారికి అద్భుతమైన న్యూస్.. అందులోనూ జంటగా పెట్టుబడి పెడతామంటే ఇంకా మంచిది. మీరు పోస్టాఫీసులో ఆర్డీ, టీడీ, ఎంఐఎస్, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వంటి వివిధ రకాల సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ ప్రభుత్వ హామీ అందించే పథకాలను అందిస్తోంది.

ఇందులో నెలవారీ ఆదాయ పథకం కింద ఇప్పటికీ 7.4 శాతం వార్షిక వడ్డీ అందిస్తోంది. ఈ పథకంలో మీరు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ప్రతి నెలా గ్యారెంటీతో స్థిర వడ్డీ వస్తుంది.

ఖాతా తెరిచిన తర్వాత వచ్చే 5 ఏళ్ల పాటు మీకు భారీ వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో మీ భార్యతో లేదా కుటుంబంలోని ఇతర సభ్యునితో కలిసి ఉమ్మడిగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రతి నెలా గరిష్టంగా రూ. 9250 వరకు స్థిర వడ్డీని సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Read Also : Top 5 Smartphones : ఏ ఫోన్ కావాలి బ్రో.. రూ. 25వేల లోపు లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు.. ఐదో ఫోన్ కిర్రాక్ అంతే..!

జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు జమ :
మీరు కనీసం రూ. 1,000 పెట్టుబడితో MIS అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ పథకం కింద సింగిల్, జాయింట్ ఖాతాలు రెండింటినీ ఓపెన్ చేయొచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు జమ చేయవచ్చు.

పోస్టాఫీస్ ఎంఐఎస్ పథకం కింద ఒక జాయింట్ ఖాతాలో గరిష్టంగా ముగ్గురిని చేర్చవచ్చు. మీ భార్యతో కలిసి ఈ పథకం జాయింట్ ఖాతాలో రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. కేవలం వడ్డీ నుంచే భారీ మొత్తంలో నెలవారీ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.

ప్రతి నెలా రూ. 9250 ఫిక్స్‌డ్ వడ్డీ :
భార్యాభర్తలిద్దరూ పోస్టాఫీస్ ఎంఐఎస్ పథకంలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ. 9,250 స్థిర వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం కింద సంపాదించిన వడ్డీ నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

పోస్టాఫీస్ ఎంఐఎస్ పథకం కింద 5 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి డబ్బులన్నీ మీ ఖాతాలో జమ అవుతాయి. ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి.