Top 5 Smartphones : ఏ ఫోన్ కావాలి బ్రో.. రూ. 25వేల లోపు లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే టాప్ 5 స్మార్ట్ఫోన్లు.. ఐదో ఫోన్ కిర్రాక్ అంతే..!
Top Smartphones : ఒకసారి ఛార్జింగ్ పెడితే ఎక్కువ సమయం ఛార్జ్ అందించే మంచి ఫోన్ కావాలా? రూ. 25వేల లోపు ధరలో మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.
Top Smartphones
- లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే రూ. 25వేల లోపు టాప్ 5 స్మార్ట్ఫోన్లు
- వన్‌ప్లస్ నుంచి ఐక్యూ Z11x 5జీ ఫోన్ వరకు ఏ ఫోన్ కొంటారు?
- ఒకసారి ఛార్జింగ్ పెడితే లాంగ్ టైమ్ ఛార్జింగ్ అందించే ఫోన్లు ఇవే
Top 5 Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు లాంగ్ బ్యాటరీ లైఫ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్ ధరలో అద్భుతమైన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ సమయం ఛార్జింగ్ అందించే ఫోన్లనే చాలామంది ఇష్టపడుతుంటారు.
మీరు కూడా లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే. భారీ బ్యాటరీలతో లభించే కొన్ని బెస్ట్ స్మార్ట్ఫోన్లను మీకోసం అందిస్తున్నాం. రూ. 25వేల లోపు ధరలో మీకు నచ్చిన అద్భుతమైన లాంగ్ బ్యాటరీ లైఫ్ అందించే ఫోన్ కొనేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి.
వన్‌ప్లస్ నార్డ్ CE 5 (రూ. 24,996):
ఈ వన్‌ప్లస్ ఫోన్ డ్యూయల్ 50MP + 8MP రియర్ కెమెరా, 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అపెక్స్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. కలర్ఓఎస్ 15పై రన్ అవుతుంది. ఇందులో 1 బిలియన్ కలర్ ఆప్షన్లు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1430 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్ప్లే కూడా ఉంది. ఇందులో 5200mAh బ్యాటరీ, 80W ఛార్జర్ ఉన్నాయి.
రెడ్మి నోట్ 15 5జీ (రూ. 24,999):
రెడ్మి నోట్ 15 5జీ ఫోన్ 68 బిలియన్ కలర్లు, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో ఈ యూనిట్, హైపర్ఓఎస్ 2పై రన్ అవుతుంది. ఇందులో 108MP + 8MP రియర్ కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5520mAh బ్యాటరీ, 45W ఛార్జర్ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M56 5జీ (రూ. 22,999) :
శాంసంగ్ గెలాక్సీ M56 5జీ ఫోన్ 50MP + 8MP + 2MP రియర్ కెమెరా, 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఎక్సినోస్ 1480 చిప్సెట్తో వన్ యూఐ 7పై రన్ అవుతుంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల సూపర్ అమోల్డ్ ప్లస్, డిస్ప్లే, 5000mAh బ్యాటరీ సపోర్ట్ ఉన్నాయి.
మోటోరోలా G67 పవర్ 5జీ (రూ. 17,349) :
మోటోరోలా G67 పవర్ 5జీలో 50MP + 8MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.7-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. 7000mAh బ్యాటరీ, 30W ఛార్జర్ అందిస్తుంది.
ఐక్యూ Z11x 5జీ (రూ. 22,999) :
ఐక్యూ Z11x 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ (HBM)తో 6.76-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్‌తో ఈ యూనిట్, ఆరిజిన్OS 6పై రన్ అవుతుంది. ఇందులో డ్యూయల్ 50MP రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే, 7200mAh బ్యాటరీ, 44W ఛార్జర్ కూడా ఉంది.
