PPF Calculator : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. ప్రతి ఏడాది రూ.50,000 డిపాజిట్ చాలు.. 15ఏళ్లలో ఎంత సంపాదిస్తారంటే? పూర్తి లెక్కలివే!
PPF Calculator : పీపీఎఫ్ పథకం కింద ఏడాదిలో కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఎంత రాబడి వస్తుందంటే?
- Sreehari A
- Published On : March 31, 2026 / 06:00 AM IST
PPF Calculator
- పోస్టాఫీసులో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయాలా?
- ప్రతి ఏడాది రూ. 500 నుంచి రూ. 1.50 లక్షలు డిపాజిట్
- పీపీఎఫ్ పథకం కింద 7.1 శాతం వార్షిక వడ్డీ రేటు
- 15 ఏళ్లలో ఎంత రాబడి వస్తుందంటే?
PPF Calculator : పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే, మీకోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది. సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను అందిస్తోంది. అందులో పోస్టాఫీసు ద్వారా అందించే పీపీఎఫ్ స్కీమ్ ఒకటి. ఈ పథకాన్నే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అని కూడా అంటారు. మీరు ఇందులో పెట్టుబడి పెడితే భారీ మొత్తంలో వడ్డీ సంపాదించుకోవచ్చు.
ప్రస్తుతం పీపీఎఫ్ పథకం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. మీరు పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెడితే సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా డబ్బును డిపాజిట్ చేయాలి. లేదంటే.. ప్రతి ఏడాదిలో పీపీఎఫ్ ఖాతాలో ఒకేసారి పెద్ద మొత్తాన్ని కూడా డిపాజిట్ చేయవచ్చు. 12 వాయిదాల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
రూ. 500తో PPF ఖాతా ఓపెనింగ్ :
పీపీఎఫ్ పథకం కింద ప్రతి ఏడాది కనీసం రూ. 500 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. పీపీఎఫ్ అకౌంట్ 15 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. పోస్టాఫీస్ మాత్రమే కాకుండా ఇతర ఏ బ్యాంకులోనైనా PPF అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
మీ పీపీఎఫ్ ఖాతాలో ఏటా రూ. 50,000 పెట్టుబడి పెడితే 15 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 13,56,070 లభిస్తుంది. మీ పెట్టుబడి రూ. 7,50,000, వడ్డీ రూ. 6,06,070 ఉంటాయి.
పీపీఎఫ్ ఖాతాపై లోన్ సౌకర్యం :
పీపీఎఫ్ ఖాతాతో అనేక సౌకర్యాలు ఉన్నాయి. మీరు పీపీఎఫ్ ఖాతాతో సులభంగా లోన్ పొందవచ్చు. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఏడాదిలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. మీరు ఒక ఏడాదిలో కనీసం రూ. 500 కూడా డిపాజిట్ చేయకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది. అయినా ఆందోళన అవసరం లేదు.
ఎందుకంటే.. పెనాల్టీ చెల్లించిన తర్వాత కూడా మళ్లీ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. PPF అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 5 ఏళ్ల వరకు మీరు ఈ అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేయలేరు. 5 ఏళ్ల తర్వాత తీవ్రమైన అనారోగ్యం, పిల్లల విద్య వంటి కొన్ని పరిస్థితుల్లో మాత్రమే PPF అకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోగలరు.
