Post Office Scheme : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. ఈ TD పథకంలో రూ. లక్ష పెట్టుబడి పెడితే.. ఎన్ని ఏళ్లలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
Post Office Scheme : పోస్టాఫీసులో 5ఏళ్ల కాలానికి TD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసు 2 ఏళ్లు, 3 ఏళ్ల TDపై భారీగా వడ్డీ రేట్లను తగ్గించింది.

Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన పథకం (Post Office Scheme) అందుబాటులో ఉంది. అదే.. టైమ్ డిపాజిట్ స్కీమ్ (Time Deposit Scheme) పథకం. ఈ పోస్టల్ డిపార్ట్‌మెంట్ కస్టమర్ల కోసం అనేక వడ్డీ రేట్లలో మార్పులు చేసింది. ఈ పథకంలో సవరించిన వడ్డీ రేట్లను పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
పోస్టాఫీస్ నిర్దిష్ట కాలానికి చెందిన TD పథకం వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే, నిర్దిష్ట కాలానికి చెందిన TD పథకం వడ్డీ రేట్లు కూడా పెరిగాయి. పోస్టాఫీస్ TD పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలి? కేవలం రూ. 1 లక్ష డిపాజిట్ చేస్తే.. రూ. 14,663 స్థిర వడ్డీని ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
2 ఏళ్లు, 3 ఏళ్ల TD వడ్డీ రేట్లు తగ్గాయి :
పోస్టాఫీసులో 1 ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్ల కాలానికి TD అకౌంట్ (Post Office Scheme) ఓపెన్ చేయొచ్చు. 2 ఏళ్లు, 3 ఏళ్ల TDపై వడ్డీ రేట్లను పోస్టాఫీసు తగ్గించింది. 2 ఏళ్ల TDపై వడ్డీ రేటును పోస్టాఫీసు 7.0 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. 3 ఏళ్ల TDపై 7.1 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించింది. 5 ఏళ్ల TDపై వడ్డీ రేటును 7.5 శాతం నుంచి 7.7 శాతానికి పెంచింది. ఒక ఏడాది TDపై వడ్డీ రేటు గతంలో మాదిరిగానే 6.9 శాతంగా పొందవచ్చు.
రూ. లక్ష డిపాజిట్ చేస్తే రూ. 14,663 స్థిర వడ్డీ :
మీరు పోస్టాఫీసులో 2 ఏళ్ల TD పథకంలో రూ. 1 లక్ష డిపాజిట్ (Post Office Scheme) చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 1,14,663 రాబడి వస్తుంది. ఇందులో మీరు పెట్టుబడి పెట్టిన రూ. లక్షతో పాటు రూ. 14,663 స్థిర వడ్డీ పొందవచ్చు. పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ (TD) పథకంలో నిర్ణీత సమయం తర్వాత స్థిర వడ్డీని పొందవచ్చు. పోస్టాఫీసు పథకంలో జమ చేసిన డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉండదు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.