Post Office Scheme : భార్యాభర్తల కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్.. జాయింట్ అకౌంట్లో పెట్టుబడి.. ఏడాదికి రూ. లక్షకుపైగా సంపాదించొచ్చు..!

Post Office Scheme : పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంలో జంటగా పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి ఏడాదికి రూ. లక్షకుపైగా వడ్డీ ద్వారా డబ్బులను సంపాదించుకోవచ్చు. ఈ పథకంలో ఎలా పెట్టుబడి పెట్టాలంటే?

Post Office Scheme

Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. ప్రత్యేకించి భార్యాభర్తల కోసం పోస్టాఫీసు సూపర్ స్కీమ్ అందిస్తోంది. ఈ పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) ద్వారా మీరు జంటగా డబ్బులు సంపాదించుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకేసారి డబ్బు రాబడిని పొందవచ్చు.

Read Also : UPI New Rules : యూపీఐ కొత్త రూల్స్.. యూజర్లకు బిగ్ రిలీఫ్.. ఇకపై పొరపాటున కూడా డబ్బులు రాంగ్ పర్సన్‌కు పంపలేరు..!

ప్రభుత్వ పథకం మాదిరిగానే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మీరు ఏడాదికి రూ. 1 లక్ష 10 వేలు (రూ. 1.10 లక్షలు) సంపాదించవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో పాటు పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ అకౌంటులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో ఒకేసారి డిపాజిట్ చేయడం ద్వారా మీరు క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చు.

ఒకేసారి ఎంత డిపాజిట్ చేయాలంటే? :
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే.. కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత రూ. వెయ్యి నుంచి డిపాజిట్ చేయవచ్చు. ఇందులో ఒకే అకౌంటులో గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంటులో గరిష్టంగా రూ. 15 లక్షలు జమ చేయవచ్చు. ఈ జాయింట్ అకౌంటులో ప్రతి హోల్డర్‌కు పెట్టుబడిలో సమాన వాటా పొందవచ్చు.

వడ్డీ రేటు ఏడాదికి 7.4 శాతం :
పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ ఖాతాపై ప్రస్తుత వడ్డీ రేటు ఏడాదికి 7.4 శాతం ఉంటుంది. ఇప్పుడు ఒకే అకౌంట్ ద్వారా గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్టంగా రూ. 15 లక్షలు జమ చేయవచ్చు.

పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ అకౌంట్ అనేది ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకం. రాబడిపై హామీ పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకంలో వంద శాతం భద్రత పొందవచ్చు. ఒకే అకౌంట్‌తో పాటు జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

నెలవారీ ఆదాయం : ప్రతి నెలా ఎంత డబ్బు వస్తుందంటే? :
వడ్డీ రేటు : 7.4శాతం వార్షికంగా
జాయింట్ అకౌంట్ నుంచి గరిష్ట పెట్టుబడి : రూ. 15 లక్షలు
వార్షిక వడ్డీ : రూ. 1,11,000
నెలవారీ వడ్డీ : రూ. 9,250

మీకు ఒకే అకౌంట్ ఉంటే..

వడ్డీ రేటు : 7.4శాతం వార్షికంగా
జాయింట్ అకౌంట్ నుంచి గరిష్ట పెట్టుబడి : రూ. 9 లక్షలు
వార్షిక వడ్డీ : రూ. 66,600
నెలవారీ వడ్డీ : రూ. 5,550

ఈ చిన్న సేవింగ్స్ స్కీమ్ వార్షిక వడ్డీ 7.4 శాతం ఇస్తోంది. ఇందులో జమ చేసిన డబ్బుపై వార్షిక వడ్డీ 12 భాగాలుగా విభజిస్తోంది. ప్రతి నెలా మీ ఖాతాకు వస్తుంది. మీరు నెలవారీగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ పోస్టాఫీసు సేవింగ్ అకౌంట్లోనే ఉంటుంది. ఈ డబ్బును ప్రిన్సిపల్‌ అమౌంట్‌తో పాటు మీకు మరింత వడ్డీ లభిస్తుంది. ఈ పథకం మెచ్యూరిటీ 5 ఏళ్లు, కానీ, 5 ఏళ్ల తర్వాత కొత్త వడ్డీ రేటు ప్రకారం పొడిగించవచ్చు.

Read Also : Best Recharge Plans : నెలవారీ రీఛార్జ్‌లతో విసిగిపోయారా? మీ నెట్‌వర్క్ ఏదైనా 7 బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు!

అర్హతలివే :

  • పెద్దవారి పేరు మీద ఒకే అకౌంట్
  • జాయింట్ అకౌంట్ (గరిష్టంగా ముగ్గురు పెద్దలు) (జాయింట్ A లేదా జాయింట్ B)
  • మైనర్ పేరు మీద గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
  • 10 ఏళ్ల వయస్సు గల మైనర్ పేరుతో ఓపెన్ చేయొచ్చు.

Disclaimer : పోస్టాఫీసు సేవింగ్స్ స్కీమ్ గురించి సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీకు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మీకు దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించండి.