×
Ad

Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? పోస్టాఫీసులో రూ. 2 లక్షలు పెట్టుబడితో ఏకంగా రూ. 90వేలు వడ్డీనే సంపాదించుకోవచ్చు

Post Office Scheme : పోస్టాఫీసులో కేవలం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడిపై ఎలాంటి రిస్క్ ఉండదు. పెట్టుబడి మొత్తంపై భారీ మొత్తంలో రాబడిని పొందవచ్చు. దాదాపు రూ. 90వేలకు పైగా వడ్డీనే పొందవచ్చు. అది ఎలాగంటే?

Post Office Scheme ( Image credit to Original Source )

  • పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేవారికి అద్భుతమైన రాబడి
  • కేవలం రూ. 2 లక్షలు డిపాజిట్ ద్వారా రూ. 90వేలు అధిక రాబడి
  • పోస్టాఫీసు పథకాల్లో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి
  • ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా

Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే మీ నెలవారీ జీతంలో కొంత డబ్బు ఆదా చేసుకోండి. ఆ డబ్బులతో పాటు మీరు దాచుకున్న మరికొంత డబ్బును కలిపి పెట్టుబడిగా పెట్టండి. ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియడం లేదా? చాలామంది తమ ఆదాయంలో కొన్ని డబ్బులు సేవ్ చేసుకుని ఆ డబ్బును పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు.

అది కూడా సురక్షితమైన పెట్టుబడితో ఎక్కువ రాబడిని (Post Office Scheme) అందించే పెట్టుబడి పథకాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. మీరు పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది మీకోసమే. పోస్టాఫీస్ అందించే ప్రభుత్వ పథకాల్లో ఏదైనా ఒక పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

అదే స్టాక్ మార్కెట్లో అయితే రిస్క్ ఎక్కువ. కానీ, పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం చాలా ఈజీ. పైగా సురక్షితం కూడా. మార్కెట్ నష్టాల భయం కూడా ఉండదు. మీ పెట్టుబడికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రభుత్వం హామీ కూడా ఉంటుంది.

అలాంటి పథకాల్లో పోస్టాఫీస్ అందించే టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఫిక్స్ డ్ డిపాజిట్ మాదిరిగానే కేవలం రూ. 2 లక్షల పెట్టుబడిపై రూ. 90,000 అధిక రాబడిని అందిస్తుంది. అది కూడా కేవలం వడ్డీ నుంచి మాత్రమే. ఇంతకీ ఈ పథకం ద్వారా భారీ మొత్తంలో రాబడిని ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

జీరో రిస్క్, తక్కువ పెట్టుబడితో అధిక రాబడి :
పోస్టాఫీస్ అన్ని వయసుల వారికి సేవింగ్స్ స్కీమ్స్ అందిస్తుంది. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం విషయానికి వస్తే ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వం నుంచి భారీ వడ్డీని పొందవచ్చు. పెట్టుబడిపై అద్భుతమైన రాబడిని పొందవచ్చు.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 22వ వాయిదాపై షాకింగ్ అప్‌డేట్.. వేలాది రైతులకు రూ.2వేలు పడవు! మీ పేరు లిస్ట్‌లో ఉందో చెక్ చేయండి

ఈ పథకం కింద పెట్టుబడిదారులు ప్రభుత్వం నుంచి 7.5శాతం వడ్డీ రేటు పొందవచ్చు. సురక్షితమైన పెట్టుబడి మాత్రమే కాదు.. పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులు 5 ఏళ్ల వరకు అందుబాటులో ఉంటాయి.

ఏయే రుణాలపై ఎంతవరకు వడ్డీ ఉందంటే? :
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం కింద పెట్టుబడిదారులు వివిధ కాలవ్యవధులకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు ఒక ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 5 ఏళ్లకు అందుబాటులో ఉన్నాయి. వివిధ కాలవ్యవధులకు వడ్డీ రేట్లు ఒక ఏడాది పెట్టుబడికి 6.9శాతం, రెండు లేదా మూడు సంవత్సరాల పెట్టుబడికి 7శాతం, 5 ఏళ్ల పెట్టుబడికి 7.5 శాతంగా వడ్డీని పొందవచ్చు.

రూ. 2 లక్షల పెట్టుబడితో ఎంత సంపాదిస్తారు? :
ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడిదారులు కేవలం వడ్డీ నుంచి భారీగా రాబడిని సంపాదించుకోవచ్చు. 5 ఏళ్ల కాల పరిమితి ఎంచుకుంటే మరింత రాబడిని పొందవచ్చు. మీరు 5 ఏళ్ల కాలానికి టైమ్ డిపాజిట్ పథకంలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. 7.5శాతం వడ్డీ రేటుతో మీ మొత్తం కార్పస్ రూ. 289,990 అవుతుంది. వడ్డీ మొత్తం రూ. 89,990 అవుతుంది.

మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచితే చాలు వడ్డీ కూడా మరింత సంపాదించవచ్చు. ఉదాహరణకు.. ఒక పెట్టుబడిదారుడు ఈ పోస్టాఫీస్ పథకంలో 5 ఏళ్ల పాటు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే వడ్డీ ఆదాయం రూ. 224,974, యాక్టివ్ కార్పస్ రూ. 724,974 అవుతుంది.

టాక్స్ బెనిఫిట్స్ ఇవే :
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకంలో ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా అందిస్తుంది. ఈ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ కనీసం రూ. 1,000తో ఓపెన్ చేయొచ్చు. ప్రతి ఏటా వడ్డీ జమ అవుతుంది. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. అంటే ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే మీ వడ్డీ ఆదాయం అంత ఎక్కువగా పెరుగుతుంది.

Disclaimer : పోస్టాఫీసులో పెట్టబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఇందులో పెట్టుబడి పెట్టేముందు మీకు తెలిసిన ఆర్థిక నిపుణులు లేదా దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించండి.