Post Office Scheme : పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్.. నెలకు జస్ట్ రూ. 222 డిపాజిట్ చేస్తే చాలు.. లక్షాధికారి అయిపోవచ్చు.. ఎలాగంటే?

Post Office Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది.. కేవలం రూ. 222 డిపాజిట్ చేస్తే చాలు.. ఏకంగా ఎన్ని లక్షలు సంపాదించొచ్చంటే?

Post Office Scheme

Post Office Scheme : పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు (Post Office Scheme) అందించే పథకాల్లో రికరింగ్ డిపాజిట్ (RD) ఒకటి. ఈ పథకంలో రోజుకు రూ. 222 మాత్రమే ఆదా చేస్తే చాలు.. తద్వారా రూ. 11 లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం హామీతో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

పోస్టాఫీస్ RD స్కీమ్ ప్రయోజనాలేంటి? :

పోస్టాఫీస్ RD పథకంలో ప్రతి నెలా స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. అంటే.. ప్రతిరోజూ రూ.222 ఆదా చేస్తే నెలకు రూ. 6,660 అవుతుంది. 5 ఏళ్లలో మీరు మొత్తం రూ. 3,99,600 డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తంపై, మీరు 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ప్రతి 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీ అవుతుంది. వడ్డీపై వడ్డీ కూడా పొందవచ్చు.

అలా 5 ఏళ్ల తర్వాత రూ. 4,75,297 లభిస్తుంది. ఈ పెట్టుబడిని మరో 5 ఏళ్లు (మొత్తం 10 ఏళ్లు) పొడిగిస్తే.. మీ పెట్టుబడి రూ. 7,99,200 అవుతుంది. ఆపై మొత్తం రాబడి రూ. 11,37,891 అవుతుంది. రోజుకు కేవలం రూ. 222తో రూ. 11 లక్షల వరకు సంపాదించుకోవచ్చు.

Read Also : Nothing Phone 3 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై బిగ్ డిస్కౌంట్.. ఇంతకీ ఈ ఫోన్ కొనాలా? వద్దా? ఫుల్ డిటెయిల్స్..!

ఈ పథకంలో మీరు పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. నెలకు కేవలం రూ. 100తో ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. చిన్నవారు, పెద్దలు లేదా పిల్లల కోసం కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీకు ముందుగా డబ్బు అవసరమైతే, మీరు 3 ఏళ్ల తర్వాత అకౌంట్ కూడా క్లోజ్ చేయొచ్చు.

RD స్కీమ్ ఇతర ప్రయోజనాలివే :

ఒక ఏడాది డిపాజిట్ల తర్వాత మీ సేవింగ్స్‌లో 50శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ఈ రుణంపై 2శాతం అదనపు వడ్డీ మాత్రమే వసూలు చేయొచ్చు. నామినీ సౌకర్యం అందుబాటులో ఉంది. ఖాతాదారునికి ఏదైనా జరిగితే నామినీ అకౌంట్ క్లెయిమ్ చేయవచ్చు లేదా కొనసాగించవచ్చు.

ఈ పథకం వ్యవధి 5 ​​సంవత్సరాలు. కానీ, మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. నెలవారీ డిపాజిట్లు సకాలంలో చేయాలి. లేకపోతే, నెలకు ఒక శాతం జరిమానా పడుతుంది. వరుసగా 4 వాయిదాలు తప్పినట్లయితే ఖాతా క్లోజ్ అయిపోతుంది.

Disclaimer :పెట్టుబడిపై ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పెట్టుబడి పెట్టేముందు దగ్గరలోని పోస్టాఫీసును సంప్రదించండి.