Nothing Phone 3 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై బిగ్ డిస్కౌంట్.. ఇంతకీ ఈ ఫోన్ కొనాలా? వద్దా? ఫుల్ డిటెయిల్స్..!

Nothing Phone 3 : నథింగ్ ఫోన్ 3 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్‌లో ఏకంగా రూ.36,500 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే..

Nothing Phone 3 : అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3పై బిగ్ డిస్కౌంట్.. ఇంతకీ ఈ ఫోన్ కొనాలా? వద్దా? ఫుల్ డిటెయిల్స్..!

Nothing Phone 3

Updated On : August 25, 2025 / 2:21 PM IST

Nothing Phone 3 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? నథింగ్ ఫోన్ 3 ధర తగ్గింది. ఇప్పుడు సరసమైన ధరకే కొనేసుకోవచ్చు. భారత మార్కెట్లో (Nothing Phone 3 Price) దాదాపు రూ. 80వేల ధరకు లాంచ్ అయిన ఈ నథింగ్ ఫోన్ కెమెరా సెటప్, గ్లిఫ్ మ్యాట్రిక్స్ వంటి ఇతర ఫీచర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ నథింగ్ ఫోన్ 3 డీల్‌ స్పెషిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..

అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంది. అసలు ధర రూ.79,999 ఉండగా రూ.44,850కి తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు.. అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే యూజర్లకు అదనంగా రూ.1,345 అమెజాన్ పే క్యాష్‌బ్యాక్ అందిస్తుంది. ఈ నథింగ్ ఫోన్ బ్లాక్, వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also : FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కావాలా? కొనే ముందు ఈ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. అడ్రినో 825 GPUతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ నథింగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 OS ఆధారంగా నథింగ్ OS 3.5 స్కిన్‌తో 5 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది.

నథింగ్ ఫోన్ 3లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా కలిగి ఉంది. 5500mAh బ్యాటరీతో పాటు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.