FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కావాలా? కొనే ముందు ఈ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..

FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ తీసుకునేవారు ఈ రూల్స్ తప్పక తెలుసుకుని ఉండాలి. లేదంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కావాలా? కొనే ముందు ఈ రూల్స్ తెలుసుకోండి.. లేదంటే జరిగేది ఇదే..

FASTag Annual Pass

Updated On : August 25, 2025 / 1:51 PM IST

FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ తీసుకున్నారా? దేశంలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలలో (FASTag Annual Pass) ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అందించే టోల్ పాస్‌లలో FASTag వార్షిక పాస్. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక పాస్ అమల్లోకి తీసుకొచ్చింది.

అయితే, ఈ వార్షిక పాస్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. వాహన యజమానులు రూల్స్ పాటించకపోతే అనేక బెనిఫిట్స్ కోల్పోతారు. ఈ పాస్ అర్హత నుంచి యాక్టివేషన్ వరకు అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కొనుగోలు చేసే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఏంటి? :
ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) ప్రకారం.. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్‌ను ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్‌ల కోసం రూపొందించారు. క్యాష్ పేమెంట్ లేకుండా టోల్ ప్లాజాల ద్వారా సులభంగా ప్రయాణించవచ్చు. ఈ పాస్ ఏడాది లేదా 200 ట్రిప్పులకు చెల్లుతుంది. అయితే ఇందులో ఏది ముందు పూర్తి అయితే అది వర్తిస్తుంది.

వార్షిక పాస్ ఎక్కడ కొనవచ్చు? :
మీ వాహనంలో ఫాస్‌ట్యాగ్ ఉంటే.. మీరు టోల్ బూత్‌ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు. NHAI వెబ్‌సైట్ లేదా హైవే యాత్ర మొబైల్ యాప్ ద్వారా పాస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

Read Also : Apple iPhone 16 : అమెజాన్ అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే అతితక్కువ ధరకే..!

యాక్టివేషన్ ఎలా? :
యాక్టివేషన్ చేసే ముందు మీ వాహనం అర్హత ఉందో లేదో చెక్ చేయాలి. మీ ప్రస్తుత FASTag వ్యాలిడిటీ ఎప్పటివరకూ NHAI చెక్ చేస్తుంది. ఒకసారి వెరిఫికేషన్ పొందిన తర్వాత, రూ. 3వేలు చెల్లించాలి. చెల్లింపు చేసిన రెండు గంటల్లోపు పాస్ యాక్టివేట్ అవుతుంది.

కొత్త ఫాస్ట్ ట్యాగ్ అవసరమా? :

  • కొత్త ఫాస్ట్ ట్యాగ్ అవసరం లేదు. వార్షిక పాస్ మీ ప్రస్తుత ఫ్యాస్ట్ ట్యాగ్ లింక్ అయి ఉంటుంది.
  • విండ్‌స్క్రీన్‌పై సరిగ్గా ఇన్‌స్టాల్ చేయాలి.
  • మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది.
  • బ్లాక్ లిస్ట్ చేసి ఉండకూడదు.

మీ ఫాస్ట్ ట్యాగ్ వదులుగా ఉన్నా, హ్యాండ్‌హెల్డ్ అయినా లేదా తప్పుగా ఇన్‌స్టాల్ చేసినా పాస్ పనిచేయదు. తద్వారా మీరు చెల్లించిన రూ. 3వేలు వృధా అయినట్టే.

వేరే వాహనంలో ఫాస్ట్ ట్యాగ్ వాడవచ్చా? :
లేదనే చెప్పాలి. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడం సాధ్యం కాదు. రిజిస్టర్డ్ వాహనంతో మాత్రమే ఉపయోగించవచ్చు. ఎవరైనా ఈ ఫాస్ట్ ట్యాగ్ మరో కారులో ఉపయోగించడానికి ప్రయత్నిస్తే అది ఇన్ యాక్టివ్ అవుతుంది. అలాగే, ఛాసిస్ నంబర్‌తో మాత్రమే రిజిస్టర్ అయితే సరిపోదు.. వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) కూడా ఫాస్ట్ ట్యాగ్ తో అప్ డేట్ చేయాలి.

తరచుగా హైవేలో ప్రయాణించే వారికి ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ బెస్గ్ ఆప్షన్. అయినప్పటికీ, ఇన్‌స్టాలేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే రూ. 3వేలు నష్టపోవాల్సి వస్తుంది. దరఖాస్తుకు ముందు మీ ఫాస్ట్ ట్యాగ్ వ్యాలిడిటీ ఉందా? సరిగ్గా ఇన్‌స్టాల్ చేసిందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చూసుకోవాలి.