Post Office Scheme
Post Office Scheme : మీకు ఈ నెల జీతం పడిందా? అయితే వెంటనే ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టండి. ప్రభుత్వ పథకాల్లో అయితే ఇంకా బెస్ట్.. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, పోస్టాఫీస్ పథకాలు అత్యంత సురక్షితమైనవి. ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండవు. ఈ పథకాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది..
అందుకే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. పోస్టాఫీసు అందించే పథకాల్లో (Post Office Scheme) పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం. ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ పథకం ద్వారా కేవలం 5 ఏళ్లలో లక్షాధికారి అయిపోవచ్చు.
పోస్టాఫీస్ RD స్కీమ్ ఏంటి? :
పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ అనేది ప్రతి నెలా ఒక స్థిర మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. 5 ఏళ్లలో స్థిర వడ్డీ రేటుతో భారీగా రాబడిని సంపాదించుకోవచ్చు. పోస్టాఫీస్ ప్రస్తుతం నెలవారీగా 6.7శాతం (సంవత్సరానికి చెల్లించే) వడ్డీని అందిస్తోంది.
ఉదాహరణకు.. ఒక వ్యక్తి నెలకు రూ. 25వేలు పెట్టుబడి పెడితే, 5 (60 నెలలు) తర్వాత మొత్తం డిపాజిట్ రూ. 15 లక్షలు అవుతుంది. ఈ డిపాజిట్‌పై, ఆ వ్యక్తి దాదాపు రూ. 2.84 లక్షల వడ్డీని సంపాదిస్తాడు. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 17,84,148 అందుతుంది. పూర్తిగా సురక్షితం అందులోనూ ప్రభుత్వ గ్యారెంటీ అందించే ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. మీరు మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఎవరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చంటే? :
ఏ భారతీయ పౌరుడైనా పోస్టాఫీస్ RD పథకం కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీరు సింగిల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ లేదా గార్డియన్ ద్వారా మైనర్ పేరుతో కూడా ఓపెన్ చేయొచ్చు. మీరు ఈ స్కీమ్ నెలకు కేవలం రూ. 100తో ప్రారంభించవచ్చు.
ఆ తర్వాత, మీ అవసరానికి అనుగుణంగా ఎంత మొత్తం అయినా పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో గరిష్ట పరిమితి లేదు. పెట్టుబడిదారుడు మరణిస్తే.. నామినీ మొత్తం డిపాజిట్, వడ్డీని అందుకుంటారు. ఇందుకోసం నామినీ అవసరమైన డాక్యుమెంట్లను పోస్టాఫీసులో సమర్పించాలి. నామినీ కోరుకుంటే ఆర్‌డీ అకౌంట్ కూడా కొనసాగించవచ్చు.
పోస్టాఫీస్ RD పథకం కాలపరిమితి 5 ఏళ్లు (60 నెలలు). ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. వడ్డీ నెలవారీగా చక్రవడ్డీ అందిస్తారు. దీని అర్థం మీరు వడ్డీపై వడ్డీని సంపాదిస్తారు. మీ మొత్తం రాబడిని పెంచుతుంది.
ఖాతా తెరిచేటప్పుడు ఇవి తప్పక గుర్తుంచుకోండి :
ప్రతి నెలా గడువు తేదీకి ముందే మీ RD అకౌంటులో డబ్బు జమ చేయాలి. మీరు ఆలస్యం చేస్తే.. ప్రతి రూ. 100కి రూ.1 జరిమానా విధిస్తారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో మీ కుటుంబం ఈజీగా ఫండ్స్ పొందగలిగేలా నామినీ కూడా ఎంపిక చేసుకోండి. మీకు డబ్బు అవసరమైతే ఒక ఏడాది తర్వాత మీ రికరింగ్ డిపాజిట్‌పై రుణం తీసుకోవచ్చు. అవసరమైతే 3 ఏళ్ల తర్వాత మీరు అకౌంట్ ముందుగానే క్లోజ్ చేయొచ్చు.
ఈ స్కీమ్ ఎందుకు బెటర్ అంటే? :
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా సురక్షితమైనది. పన్ను ప్రయోజనాలతో గ్యారెంటీ రాబడిని అందిస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు ప్రభుత్వం ద్వారా మద్దతు అందిస్తుంది. వడ్డీ రేటు చాలా బ్యాంకుల కన్నా స్థిరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా సేవింగ్ చేసి భారీ మొత్తంలో సంపాదించుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు లేదా గృహిణులు ఎవరికైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
కోటీశ్వరుడు అవ్వాలంటే RD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి :
పోస్టాఫీస్ RD స్కీమ్ అనేది ఎలాంటి రిస్క్ లేకుండా అందించే అద్భుతమైన పథకం. ప్రతి నెలా ఒక చిన్న మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. తద్వారా కేవలం 5 ఏళ్లలో లక్షాధికారి కావచ్చు. మీరు కూడా కోటీశ్వరుడు కావాలంటే మీకు దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లి రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరండి. చిన్న మొత్తంలో సేవింగ్స్ చేస్తూ భారీ మొత్తంలో సంపదను సృష్టించుకోవచ్చు.