×
Ad

Post Office Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. జస్ట్ రోజుకు రూ. 500 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఎన్ని ఏళ్లలో రూ. 25 లక్షలు సంపాదిస్తారంటే?

Post Office Scheme : పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. మీరు రోజుకు రూ. 500 సేవ్ చేయడం ద్వారా కొన్ని ఏళ్లలోనే రూ. 25 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office Scheme (Image Credit To Original Source)

  • పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం
  • సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ రేటు, త్రైమాసికానికి ఒకసారి చక్రవడ్డీ
  • రూ. 25 లక్షల సంపాదనపై పూర్తి లెక్కలివే

Post Office Special Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెడుతున్నారా? పోస్టాఫీసులో పెట్టుబడితో అద్భుతమైన రాబడిని పొందవచ్చు. మీరు రోజుకు కేవలం రూ. 500 డిపాజిట్ చేయడం ద్వారా భవిష్యత్తులో లక్షల రూపాయలు కూడబెట్టుకోవచ్చు. పోస్టాఫీసు అందించే పథకాల్లో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ఒకటి. జనవరి 2026 నాటికి ఈ పథకంలో వడ్డీ రేటు ఏడాదికి 6.7%, త్రైమాసికానికి ఒకసారి చక్రవడ్డీ చెల్లిస్తుంది.

ఈ పథకం వ్యవధి 5 ఏళ్లు. అవసరమైతే మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు. ఒక వ్యక్తి రోజుకు రూ. 500 ఆదా చేస్తే నెలకు సుమారు రూ. 15,000 డిపాజిట్ అవుతుంది. 5 ఏళ్లలో మొత్తం డిపాజిట్ మొత్తం రూ. 9 లక్షలు. వడ్డీతో కలిపి మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ. 10.70 లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ పథకం నుంచి మీరు రూ. 25 లక్షలు ఎలా సంపాదించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మీరు రోజుకు రూ. 500 ఆదా చేస్తే.. నెలకు సుమారు రూ. 15వేలు డిపాజిట్ అవుతుంది. ఎందుకంటే.. రూ. 500 x 30 రోజులు రూ. 15వేలు. ఇప్పుడు, మీరు 5 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 15వేలు డిపాజిట్ చేస్తే మొత్తం డిపాజిట్ రూ. 9 లక్షలు అవుతుంది.

అంటే.. రూ.15వేలుx 60 నెలలు రూ. 9 లక్షలు. 6.7శాతం వడ్డీతో మెచ్యూరిటీ తర్వాత మీకు సుమారు రూ. 10.70 లక్షలు అందుతాయి. ప్రభుత్వం హామీతో అందించే ఈ ఆర్‌డీ పథకంలో పెట్టుబడిపై ఎలాంటి రిస్క్ ఉండదు.

కేవలం వడ్డీనే రూ. 1.5 లక్షలు సంపాదన :
రూ. 1.5 లక్షల కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. మరో 5 ఏళ్లు, మొత్తం 10 ఏళ్లు పొడిగిస్తే భారీగా వడ్డీ పొందవచ్చు. మొదటి 5 ఏళ్లు మెచ్యూరిటీ మొత్తంపై వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. మీరు ప్రతి నెలా రూ. 15వేలు డిపాజిట్ చేస్తూ ఉంటే.. మొత్తం డిపాజిట్ రూ. 18 లక్షలకు చేరుకుంటుంది.

Post Office Scheme (Image Credit To Original Source)

10 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ మొత్తం సుమారు రూ. 25 లక్షల 60 వేలు ఉంటుంది. అందులో వడ్డీ సుమారు రూ. 7 లక్షల 60 వేలు ఉంటుంది. రోజుకు రూ. 500 ఆదా చేస్తే మీరు 10 ఏళ్లలో రూ. 25 లక్షలకుపైగా సంపాదించవచ్చు.

Read Also : Google Pixel 10 Discount : అద్భుతమైన డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10పై ఏకంగా రూ. 11వేలు తగ్గింపు.. ఈ డీల్ మళ్లీ రాదు భయ్యా..!

రూ. 100 నుంచి పెట్టుబడి :
పోస్టాఫీస్ RD ఫార్ములా ప్రకారం.. వడ్డీ త్రైమాసికానికి చక్రవడ్డీగా లెక్కిస్తారు. రోజుకు రూ. 400 ఆదా చేయొచ్చు. నెలకు రూ. 12వేలు డిపాజిట్ చేయండి. 5 ఏళ్లలో మొత్తం డిపాజిట్ రూ. 762,000, మెచ్యూరిటీ సుమారు రూ. 856,000 అవుతుంది.

10 ఏళ్లు పొడిగిస్తే.. మొత్తం డిపాజిట్ రూ. 144,000 అవుతుంది. మెచ్యూరిటీ సుమారు రూ. 205,000 ఉంటుంది. టాప్ లిమిట్ లేకుండా నెలకు కనీసం రూ. 100తో ప్రారంభించవచ్చు. 10 ఏళ్ల పిల్లలు కూడా గార్డియన్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 3 ఏళ్ల తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు. ఒక ఏడాది తర్వాత 50శాతం వరకు రుణం పొందవచ్చు.

ఈ పోస్టాఫీసు పథకం చాలా బెస్ట్. భారీ వడ్డీతో పాటు ఎలాంటి రిస్క్ ఉండదు. పెళ్లి, పిల్లల విద్య లేదా రిటైర్మెంట్ కోసం తీసుకోవచ్చు. మీరు ఉద్యోగం చేస్తుంటే నెలవారీ ఆటో-డెబిట్‌ను సెటప్ చేసుకోవచ్చు. లేదంటే మీకు దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి లేదా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.