Ratan Tata : రతన్‌ టాటా ఆరోగ్య పరిస్థితి విషమం.. ముంబై ఆస్పత్రి ఐసీయూలో చికిత్స..!

Ratan Tata Health Condition : తాజాగా రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ బుధవారం (అక్టోబర్ 9) మరోసారి వార్తలు వెలువడ్డాయి. దాంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Ratan Tata Critical, Under Intensive Care In Mumbai Hospital_ Report

Ratan Tata : టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ముంబై ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం. గత కొన్నిరోజుల క్రితమే రతన్‌ టాటా ఆరోగ్యంపై అనేక వదంతులు వ్యాపించాయి. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై ఆయనే స్వయంగా స్పందించారు.

Read Also : Flipkart Utsav Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఉత్సవ్ సేల్ మొదలైందోచ్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు..!

తనకు రక్తపోటు తగ్గిన కారణంగా ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వెళ్లినట్టు స్పష్టం చేశారు. 86 ఏళ్ల రతన్‌ టాటా ట్విట్టర్ ‘ఎక్స్‌’లో స్పందిస్తూ.. ‘‘నా ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దు.. వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలతో రెగ్యులర్ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీడియా కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదు” అని ఆయన కొట్టిపారేశారు.

తాజాగా రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ బుధవారం (అక్టోబర్ 9) మరోసారి వార్తలు వెలువడ్డాయి. దాంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. 1991లో భారత అతిపెద్ద సంస్థలలో ఒకటైన టాటా సన్స్‌కు రతన్ టాటా చైర్మన్ అయ్యారు. 2012 వరకు టాటా గ్రూపుకు ఆయనే నాయకత్వ బాధ్యతలు వహించారు.

రతన్ టాటా పదవీకాలంలో కొనసాగినంత కాలం టాటా గ్రూప్ ప్రపంచ మార్కెట్లో వేగంగా విస్తరించింది. కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ టెట్లీ వంటి అనేక కంపెనీలను టాటా గ్రూపు కొనేసింది. టాటా సంస్థను దేశీయంగా నుంచి గ్లోబల్ పవర్ హౌస్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రతన్ టాటాకే దక్కుతుంది.

రతన్ టాటా టాటా గ్రూప్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన టాటా నానోను కూడా ప్రవేశపెట్టింది. 2011-12లో మొత్తం 100.09 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించింది. 2000లో టాటా టీ ద్వారా టెట్లీ నుంచి 450 మిలియన్ డాలర్లతో అనేక కొనుగోళ్లకు నాయకత్వం వహించారు. ఈ కొనుగోళ్లలో సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ గ్రూప్ ఆదాయాలలో సగానికి పైగా దేశం వెలుపల నుంచే వచ్చింది. 1996లో టెలికమ్యూనికేషన్స్ కంపెనీ టాటా టెలిసర్వీసెస్‌ని స్థాపించారు.

2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని మరింత విస్తరించారు. ఆయన పదవీవిరమణ తర్వాత, టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్ చైర్మన్ ఎమెరిటస్ బిరుదుతో ప్రదానం చేసినట్లు కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. 2012లో చైర్మన్ పదవి నుంచి వైదొలగి తర్వాత టాటా ఇతర గ్రూప్ కంపెనీల చైర్మన్ ఎమెరిటస్‌గా ఆయన నియమితులయ్యారు. నాయకత్వ వివాదం కారణంగా 2016లో తాత్కాలిక చైర్మన్ తిరిగి నియమితులయ్యారు.

Read Also : Best Mobile Phones 2024 : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ నెలలో రూ. 20వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!