×
Ad

RBI Repo Rate : మళ్లీ నిరాశే.. రెండోసారి కీలక వడ్డీ రేట్లు మారలేదు.. ఆర్బీఐ రెపో రేటు 5.5 శాతం వద్దనే..!

RBI Repo Rate : ఆర్బీఐ రెపో రేటులో మార్పు లేదు. దీపావళికి ముందు లోన్ ఈఎంఐలో రిలీఫ్ లభిస్తుందనుకున్న రుణగ్రహీతల ఆశలు అడియాసలు అయ్యాయి.

RBI Repo Rate

RBI Repo Rate : బ్యాంకులో లోన్ తీసుకున్నారా? ఆర్బీఐ ఈసారి కూడా రెపో రేటు మార్చలేదు. వరుసగా రెండోసారి రెపో రేటును మార్చకుండా అలానే ఉంచింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీపావళికి ముందు లోన్ ఈఎంఐలో రిలీఫ్ లభిస్తుందనుకున్న రుణగ్రహీతల ఆశలు అడియాసలు అయ్యాయి.

అయితే, ఆర్బీఐ ద్రవ్యోపరపతి సమావేశంలో అక్టోబర్ 1న (బుధవారం) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక పాలసీ రేటు రెపో రేటును 5.5 శాతం వద్దనే (RBI Repo Rate) యథాతథంగా ఉంచింది. ప్రస్తుత దేశీయ, ప్రపంచ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) పాలసీ రేటులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రెపో రేటును 5.5 శాతం వద్ద ఉంచాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ, అంచనాలను సవివరంగా సమావేశంలో చర్చించామన్నారు. ఎంఎస్ఎఫ్ రేటు, బ్యాంకు రేటు 5 శాతం దగ్గరే కొనసాగనుంది. దాంతో వడ్డీ రేట్లు తగ్గుతాయని అంచనా వేసిన పారిశ్రామిక వర్గాలకు నిరాశే ఎదురైంది. వడ్డీ రేట్లు తగ్గుతాయని నిపుణులు కూడా అంచనా వేశారు. జరిగింది.

రెపో రేటు తగ్గకపోతే కస్టమర్లు తమ లోన్ ఈఎంఐలపై ఎలాంటి రిలీఫ్ పొందలేరు. రెపో రేటు అంటే.. వాణిజ్య బ్యాంకులు తమ తక్షణ అవసరాలను తీర్చుకునేందుకు ఆర్బీఐ నుంచి తీసుకునే రేటు. ఈ రేటు మారకుండా ఉంటే.. గృహ రుణాలు, వాహన రుణాలు, ఇతర రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు మారే అవకాశం ఉండదు.

రెపో రేటు, లోన్ రేటు, FD రేటు మధ్య తేడా ఏంటి? :

రెపో రేటు తగ్గినప్పుడు.. బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణం చౌకగా లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించేందుకు లోన్ వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. రెపో-లింక్డ్ లోన్ రేట్లు తగ్గడమే కాకుండా చాలా బ్యాంకులు తమ MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు) కూడా తగ్గిస్తాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పుడు బ్యాంకులకు రుణాలు ఖరీదైనవిగా మారతాయి. అప్పుడు బ్యాంకులు కస్టమర్లకు లోన్ రేట్లు భారీగా పెంచుతాయి.

Read Also : October Long Weekend : అక్టోబర్‌ లాంగ్ వీకెండ్ గైడ్.. ఈ హాలీడేస్‌కు ఇలా ట్రిప్ ప్లాన్ చేసుకోండి.. ఈ ప్రాంతాలకు వెళ్తే ఫుల్లుగా చిల్ అవ్వొచ్చు..!

ఫిక్స్‌డ్ డిపాజిట్ల పరిస్థితి ఇలా :
ఇప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD) విషయానికి వస్తే.. రుణాలకు విరుద్ధంగా ఉంది. రెపో రేటు తగ్గి బ్యాంకులు ఆర్బీఐ నుంచి చౌకైన రుణాలను పొందినప్పుడే బ్యాంకులలో ద్రవ్యత పెరుగుతుంది. ఫలితంగా FDలపై అధిక వడ్డీ రేట్లను అందించే అవకాశం ఉంటుంది. తద్వారా కస్టమర్ల నుంచి మరిన్ని డిపాజిట్లను ఆకర్షించవచ్చు.

అందుకే కొన్ని బ్యాంకులు రెపో రేటు తగ్గినప్పుడు FDలపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. అయితే, రెపో రేటు పెరిగినప్పుడు బ్యాంకులకు రుణాలు మరింత ఖరీదైనవిగా మారుతాయి. అప్పుడు ద్రవ్యతను పెంచేందుకు FDలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. ఆ సమయంలో వినియోగదారులు ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయవచ్చు.

వరుసగా రెండోసారి ఇదే నిర్ణయం :

రెపో రేటు మారకుండా ఉండటం వరుసగా రెండోసారి. గతంలో సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాదిలో ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రెపో రేటును ఒక శాతం పాయింట్ తగ్గించింది. జూన్ ద్రవ్య విధాన సమీక్షలో 0.5 శాతం పాయింట్ కోత విధించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్య విధాన సమీక్షలలో ఒక్కొక్కటి 0.25 శాతం పాయింట్లు తగ్గాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్‌బీఐ గతంలో అంచనా వేసిన 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. రిటైల్ ద్రవ్యోల్బణం గతంలో అంచనా వేసిన 3.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించింది.